Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ భార్య ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (14:00 IST)
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో విషాదకర ఘటన జరిగింది. కట్టుకున్న భర్త పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేక పోయిన వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్నై మధురవాయల్ గంగై అమ్మన్ వీధికి చెందిన రాజా (33) అనే వ్యక్తి ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఈయనకు భార్య కలైసెల్వి (28) ఉండగా, వీరికి నాలుగేళ్ళ క్రితం వివాహమైంది. యేడాది వయస్సుండే ధనీశ్వరన్ అనే కుమారుడు ఉన్నాడు. 
 
ఈ క్రమంలో రాజాకు స్థానికంగా నివసించే మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని భార్య పసిగట్టింది. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు జరుగతున్నాయి. ఆదివారం కూడా వీరిద్దరూ గొడవపడ్డారు. దీంతో రాజా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆయన ఇంటికి వచ్చి చూడగా వంట గదిలో కలై సెల్వి ఉరేసుకుని కనిపించింది. 
 
దీంతో ఆయన మధురవాయల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. భర్త అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే కలైసెల్వి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments