భార్యను హతమార్చి.. సన్యాసిగా మారిన భర్త.. పట్టించిన ఫోన్‌ పే ట్రాన్సాక్షన్

Webdunia
ఆదివారం, 9 జులై 2023 (13:16 IST)
చెన్నై ఓట్టేరి ప్రాంతంలో రెండేళ్లకు మునుపు భార్యను హత మార్చి సన్యాసి వేషంలో సంచరించిన భర్తను పోలీసులు శనివారం ఉదయం ఆరెస్టు చేశారు. తన కుమారులకు ఫోన్‌‍పే ద్వారా నగదు చెల్లించడంతో ఆయన గుట్టు బయటపడింది. ఓట్టేరి ఏకాంకిపురంలో రమేష్, వాణి దంపతులు నివసించేవారు. ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులకు గౌతమ్, హరీష్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 
 
రెండేళ్లకు ముందు భార్యతో గొడవపడిన రమేష్ ఆమెను దారుణంగా హత్య చేసి పారిపోయాడు. పోలీసులు రమేష్ ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది. పరారైన రమేష్ పోలీసులు తనను గుర్తించకుండా జట్టు, గడ్డం పెంచుకుని కాషాయ వస్త్రం ధరించి తిరువణ్ణామలై, వడలూరు, చదురగిరి తదితర ప్రాంతాల్లో సంచరించసాగాడు. 
 
రెండేళ్ల పాటు అతడి అజ్ఞాతవాసం సాఫీగా గడించింది. అయితే ఇటీవల రమేష్ తన స్నేహితుడైన మరో సన్యాసి సెల్ఫోన్ ద్వారా తాను భిక్షమెత్తి సంపా దించిన నగదును తన ఇద్దరు కుమారులకు ఫోన్ పే ద్వారా ఓట్టేరిలో ఉన్న పాత స్నేహితుడికి పంపారు. ఆ తర్వాత ఆ సెల్‌ఫోన్ ద్వారా ఓట్టేరి స్నేహితుడికి ఫోన్ చేసి తాను పంపిన నగదును కుమారులకు అందజేయమని రమేష్ తెలిపాడు. రమేష్‌పై తీవ్ర నిఘా వేసిన పోలీసులకు ఈ ఫోన్ పే నగదు చెల్లింపు, రమేష్ ఓట్టేరి స్నేహితుడికి ఫోన్ చేసిన సంఘటన గురించి తెలిసింది. 
 
ఆ తర్వాత రెండు రోజులకు ముందు రమేష్ సన్యాసిగా ఢిల్లీలోని ఆశ్రమానికి వెళ్ళనున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ మేరకు పోలీసులు సెంట్రల్ స్టేషన్ వద్ద రమేష్ పాత ఫొటోను చేత. పట్టుకుని నిఘా వేశారు. శనివారం వేకువజావన చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు సన్యాసి రూపంలో వచ్చిన రమేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments