Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహానికి 4 గంటల పెరోల్.. తాళికట్టి మళ్లీ జైలుకెళ్లిన వరుడు

Webdunia
ఆదివారం, 26 మార్చి 2023 (10:01 IST)
తాను అత్యాచారానికి పాల్పడిన ఓ యువతితని నిందితుడు వివాహం చేసుకున్నాడు. ఈ అత్యాచారం కేసులో అరెస్టు అయి జైలులో ఉంటున్న నిందితుడు.. అదే అత్యాచార బాధితురాలిని వివాహం చేసుకునేందుకు పెరోల్‌‍పై జైలు నుంచి విడుదలయ్యాడు. ఆ తర్వాత అత్యాచార బాధితురాలి మెడలో తాళికట్టిన నిందితుడు.. ముహూర్తం ముగిసిన తర్వాత తిరిగి జైలుకు వెళ్ళాడు. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలోని గోపాల్ గంజ్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గోపాల్ గంజ్ జిల్లాకు చెందిన రాహుల్ కుమార్ అనే యువకుడు హాజీపుర్‌లో ఇంజినీరింగ్‌ చదివాడు. బాధిత యువతి ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అమ్మాయి. వీరిద్దరూ మంచి స్నేహితులు. వీరి స్నేహం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మార్చి 4న వీరు గోపాల్‌గంజ్‌లోని ఓ గుడికి వెళ్లారు. 
 
ఆరోజు రాత్రి రాహుల్‌ కుమార్‌ స్నేహితుని ఇంటికి వెళ్లారు. ఆ రాత్రి జరిగిన ఘటనతో యువతి ఆరోగ్యం క్షీణించింది. యువతి అత్యాచారానికి గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రాహుల్‌ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. 
 
తాను అత్యాచారం చేయలేదనీ, ఇద్దరం ప్రేమించుకున్నామని కోర్టులో తెలిపిన నిందితుడు ఆమెను వివాహం చేసుకునేందుకు అనుమతి కోరాడు. పెరోల్‌పై వచ్చి పెళ్లి చేసుకున్నాడు. దీంతో కోర్టు ఆ యువకుడిని నాలుగు గంటల పెరోల్ మంజూరు చేసింది. దీంతో జైలు నుంచి విడుదలైన ఆ యువకుడు అత్యాచార బాధితురాలిని వివాహం చేసుకుని తిరిగి జైలుకు వెళ్లాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments