Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్ గిఫ్ట్‌గా ఇంటికి పంపించి.. స్మార్ట్‌గా రూ.2.8 కోట్లు స్వాహా

ఠాగూర్
సోమవారం, 20 జనవరి 2025 (13:21 IST)
సైబర్ నేరగాళ్లు కొత్తకొత్తగా ఆలోచన చేస్తున్నారు. అధునాత టెక్నాలజీని ఉపయోగించి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. తాజాగా స్మార్ట్ ఫోనును బహుమతిగా పంపించి రూ.2.8 కోట్లను కాజేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగళూరు నగరానికి చెందిన ఓ యువకుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతడికి ఓ ఫోన్‌కాల్ వచ్చింది. కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేసిన వారి నెంబర్లను లాటరీ తీశామని, మీరు స్మార్ట్‌ఫోన్ గెలుచుకున్నారని చెప్పారు. అడ్రస్ అడిగి తెలుసుకున్న దుండగులు కొరియరులో నిజంగానే మొబైల్ ఫోనును పంపించారు. 
 
కొత్త ఫోన్.. అది కూడా ఫ్రీగా రావడంతో సంతోషించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. తన పాత ఫోన్‌లోని సిమ్ తీసి కొత్త ఫోనులో వేసి వాడడం మొదలుపెట్టాడు. సిమ్ వేసిన గంటలో చాలా మెసేజ్‌లు, ఓటీపీలు వచ్చినా కొత్త ఫోను కావడం వల్ల వస్తున్నాయని పట్టించుకోలేదు. 
 
అయితే, అప్పటికే ఆ ఫోనును తమ నియంత్రణలోకి తీసుకున్న స్కామర్లు.. సదరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బ్యాంకు ఖాతా వివరాలు తస్కరించి పాస్‌వర్డ్‌లు మార్చేశారు. ఆపై అతడి ఖాతాలో ఉన్న రూ.2 కోట్ల 80 లక్షలను తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు. బ్యాంకు ఖాతా మొత్తం ఖాళీ అయిన విషయం ఆలస్యంగా గుర్తించిన బాధితుడు ఆదివారం పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం బయటపడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఆర్ఆర్' తర్వాత 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీకి అరుదైన రికార్డు

తెలంగాణాలో గద్దర్ అవార్డులు సరే.. మరి ఏపీలో నంది అవార్డులు ఇస్తారా?

PRABHAS :భీమవరంకు రెబల్ స్టార్ ప్రభాస్ రానున్నారా?

కళాకారులకు సేవ - జంథ్యాలపై బుక్ - విజయ నిర్మల బయోపిక్ చేయబోతున్నా: డా. నరేష్ వికె

రానా దగ్గుబాటి సమర్పణలో ప్రేమంటే ఏమిటో చెప్పదలిచిన సుమ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments