Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం అంటే ఏంటి అత్తా? రెండు రోజుల తర్వాత బాలికపై అత్యాచారం!

ఠాగూర్
మంగళవారం, 27 ఆగస్టు 2024 (14:31 IST)
అత్యాచారం అంటే ఏమిటో తెలియని ఓ చిన్నారిపై కొందరు కామాంధుల సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం అంటే ఏంటి అత్తా అని అడిగిన ఓ చిన్నారిపై రెండు రోజుల తర్వాత కొందరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ నెల 22వ తేదీన అస్సాం రాష్ట్రంలోని నాగావ్ జిల్లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కోల్‌కతా మెడికో అత్యాచారం, హత్య కేసుకు సంబంధించిన వార్తలను రోజూ చూస్తున్న ఓ బాలిక... అసలు అత్యాచారం అంటే ఏంటని తన అత్తను ప్రశ్నించింది. ఆ తర్వాత రెండు రోజులకే 22వ తేదీన ట్యూషన్‌ నుంచి ఇంటికొస్తున్న బాలికను అడ్డగించిన కొందరు యువకులు ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ బాలిక అపస్మారకస్థితిలోకి జారుకుంది. మేనత్త ఇంట్లో ఉంటున్న బాలిక సాధారణంగా రిక్షాలో లేదా అత్తయ్యతో కలిసిగానీ ట్యూషన్‌కు వెళ్లి వస్తుంది. ఈ ఘటన జరిగిన రోజు మాత్రం ఆ బాలిక ఒంటరిగా సైకిల్‌పై ట్యూషన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. 
 
ఈ ఘటన తనను షాక్‌కు గురిచేసిందని పేర్కొన్నారు. ఆమెను కాపాడుకోవడంలో తాను విఫలమయ్యాయని బోరున విలపిస్తుంది. బాలికకు డీఎస్పీ కావాలని కోరికగా ఉండేదని, ఒకసారి డీఎస్పీని కలిసి మాట్లాడిందని గుర్తు చేసింది. కాగా, ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బాధిత బాలికకు న్యాయం చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడైన తఫాజుల్ ఇస్లాం పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో చెరువులో దూకి ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments