Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపాధ్యాయుడు కాదు.. కామాంధుడు.. విద్యార్థిని గర్భవతిని చేశాడు..

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2023 (12:00 IST)
ఒంగోలు జిల్లా మార్కాపురంలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన వద్ద చదువుకునే విద్యార్థిని ఓ ఉపాధ్యాయుడు గర్భవతిని చేశాడు. ఆమె ప్రైవేట్ ఫోటోలు తీసి బెదిరించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మార్కాపురం పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని 2022లో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ అభ్యసించేందుకు చేరింది. అక్కడ యర్రగొండపాలెం మండలం పాలుట్ల గ్రామానికి చెందిన గోవింద్ నాయక్ అనే వ్యక్తి అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అప్పటికే అతనికి వివాహమై ఓ కుమారుడు ఉన్నారు. 
 
ఇంటి వద్ద దించే నెపంతో విద్యార్థినిని ఓ రోజు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. పట్టణ శివారులోకి తీసుకెళ్లి అక్కడ ఆమె అసభ్యకర చిత్రాలను చరవాణిలో బంధించాడు. అనంతరం వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో సదరు విద్యార్థిని ఇంటర్ రెండో ఏడాది ఆ కళాశాలలో కాకుండా మరో చోట చదివేందుకు వెళ్లిపోయింది. 
 
అయినప్పటికీ గోవింద్ నాయక్ తన వికృత చేష్టలు మానలేదు. ఆమె అసభ్య చిత్రాలు తన వద్ద ఉన్నాయని.. ఇతరులకు చూపుతానని బెదిరింపులకు గురిచేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆ విద్యార్ధిని గర్భందాల్చింది. విషయం తెలిసిన నిందితుడు గర్భ విచ్ఛిత్తి చేసుకోవాలని డిమాండ్ చేశాడు. ఆమె అంగీకరించక పోవడంతో దాడికి పాల్పడ్డాడు. 
 
చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన ఆమెను వైద్యులు పరీక్షించారు. కడుపుపై దెబ్బలు తగలడంతో విద్యార్థిని ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి తలెత్తిందని.. గర్భ విచ్ఛిత్తి చేయాలని సూచించారు. చివరికి బాధితురాలు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రైవేట్ అధ్యాపకుడిపై అత్యాచారం, పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments