Webdunia - Bharat's app for daily news and videos

Install App

మల ద్వారంలో కేజీ బంగారాన్ని దాచిన ఎయిర్ హోస్టెస్: కన్నూరు ఎయిర్ పోర్ట్‌లో పట్టివేత

ఐవీఆర్
శుక్రవారం, 31 మే 2024 (17:11 IST)
గోల్డ్ స్మగ్లింగ్. ఎన్ని అక్రమ మార్గాల్లో చేయాలో అన్ని అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఏకంగా ఎయిర్ హోస్టెస్ పట్టుబడటం చర్చనీయాంశమైంది. అది కూడా ఆమె తన మల ద్వారంలో సుమారుగా కిలో బంగారాన్ని దాచి పెట్టుకుని వచ్చింది. పక్కా సమాచారం అందుకున్న కస్టమ్స్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
 
మే 28వ తారీఖున మస్కట్ నుంచి కేరళ లోని కన్నూర్ విమానాశ్రయానికి ఓ విమానం వచ్చింది. అందులో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందుకున్నారు కస్టమ్స్ సిబ్బంది. విమానంలో తనిఖీ చేయగా ఎయిర్ హోస్టెస్ సురభి ఖాతూన్ పైన అనుమానం కలిగింది. 
 
ఆమెను క్షుణ్ణంగా పరిశీలించగా తన మల ద్వారంలో బంగారాన్ని దాచిపెట్టినట్లు తేలింది. ఆమె నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈమె గతంలో కూడా పలుమార్లు గోల్డ్ అక్రమ రవాణా చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments