Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్త్ డే పార్టీకి వెళితే మత్తు ఇచ్చి 7 రోజుల పాటు యువతిపై 23 మంది అత్యాచారం

ఐవీఆర్
మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (15:26 IST)
నమ్మిన స్నేహితుడే ఆమె పాలిట కామాంధుడయ్యాడు. అతడితో పాటు మరో 22 మంది మృగాళ్లను వెంటేసుకుని 7 రోజుల పాటు 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేసారు. ఈ దారుణం ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మార్చి 29 రాత్రి తన స్నేహితురాలు ఇంటికి పార్టీలో పాల్గొనేందుకు వెళ్లింది. అక్కడ ఈ యువతిని చూసిన రాజ్ అనే యువకుడు కేఫ్ లోకి తీసుకెళ్లి మత్తు పానీయం తాగించి అత్యాచారం చేసాడు. మరుసటి రోజు రాజ్ స్నేహితుడు సమీర్ ఆమెను తన ఇంటి వద్ద దిగబెడతానని చెప్పి జాతీయ రహదారికి పక్కనే కారు ఆపి ఆమెపై అత్యాచారం చేసాడు.
 
ఆ తర్వాత మళ్లీ ఆమెను కేఫెకి తీసుకెళ్లి మార్చి 31న ఆమెకి డ్రగ్స్ ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఏప్రిల్ 1న వారి నుంచి ఎలాగో తప్పించుకున్న బాధితురాలు ఔరంగాబాదుకి చేరుకుంది. అక్కడ ఓ మాల్ వద్ద కూర్చుని వుండగా ఆమె పరిస్థితిని చూసిన కొందరు యువకులు నూడుల్స్ తినిపించారు. ఆ తర్వాత వారు కూడా ఈమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.
 
తనకు డ్రగ్స్ ఇవ్వడంతో మత్తులోకి వెళ్లిపోయిన యువతి... మరుసటి రోజు తన ఇంటికి వెళ్లి తనపై జరిగిన అత్యాచారాన్ని తల్లికి వివరించింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

దక్షిణాదిలో సమంత రీ ఎంట్రీ గ్రాండ్‌గా వుండబోతోంది.. చెర్రీ, పుష్పలతో మళ్లీ రొమాన్స్!?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments