19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

ఐవీఆర్
గురువారం, 24 జులై 2025 (20:16 IST)
బీటెక్ చదివే 19 ఏళ్ల కుర్రాడు, ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న 38 ఏళ్ల మహిళ స్నేహితులయ్యారు. ఆ స్నేహం కాస్తా సన్నిహిత సంబంధానికి దారి తీయడంతో ఇద్దరూ కలిసి ఎవరికీ చెప్పకుండా పారిపోయారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. చిత్తూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో 19 ఏళ్ల కుర్రాడు బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలలో ల్యాబ్ టెక్నీషియన్‌గా 38 ఏళ్ల మహిళ పనిచేస్తోంది.
 
ఈమెకి పెళ్లయింది, కానీ కొన్ని కారణాల వల్ల భర్త నుంచి విడిపోయి ఒంటరిగా వుంటోంది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా సన్నిహిత సంబంధానికి దారి తీసింది. ఈ నేపధ్యంలో ఇద్దరూ కలిసి ఎటైనా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. దాంతో యువకుడు తనకు బెంగళూరులో ఇంటెర్నిషిప్ వుందని గత మే నెల 24న ఇంట్లో చెప్పి వెళ్లిపోయాడు.
 
ఇక అప్పట్నుంచి అతడికి ఫోన్ చేస్తున్నా... మరికొన్ని రోజుల సమయం పడుతుందని చెబుతూ వచ్చాడు. దీనితో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు జూలై 15న పోలీసులకు ఫిర్యాదు చేసారు. యువకుడి ఫోన్ నెంబరు ట్రేస్ చేయగా అది బెంగళూరులో వున్నట్లు తేలింది. దాన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు అక్కడి వెళ్లి చూసి షాక్ తిన్నారు. 19 ఏళ్ల యువకుడితో 38 ఏళ్ల మహిళ కలిసి జీవిస్తోంది. వారిద్దర్నీ చిత్తూరుకి తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇరువురిని ఎవరి ఇంటికి వారిని పంపించేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments