అమ్మమ్మ పక్కనే నిద్రిస్తున్న చిన్నారి కిడ్నాప్.. అత్యాచారం...

ఠాగూర్
ఆదివారం, 9 నవంబరు 2025 (11:40 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో దారుణం జరిగింది. అమ్మమ్మ పక్కలో నిద్రపోతున్న నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే 
 
బంజారా తెగకు చెందిన ఓ కుటుంబం తారకేశ్వర్‌లోని రైల్వే షెడ్డు వద్ద నివసిస్తోంది. శుక్రవారం రాత్రి బాధితురాలు తన అమ్మమ్మ పక్కన దోమతెర కింద నిద్రిస్తోంది. అర్థరాత్రి సమయంలో దుండగులు దోమతెరను కత్తిరించి, నిద్రలో ఉన్న చిన్నారిని ఎత్తుకెళ్లారు. శనివారం మధ్యాహ్నం, తారకేశ్వర్ రైల్వే హై డ్రెయిన్ సమీపంలో బాలిక రక్తపు మడుగులో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు.
 
'నాతో పాటే నిద్రపోతోంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఎవరో పాపను ఎత్తుకెళ్లారు. పాపను ఎప్పుడు తీసుకెళ్లారో కూడా నాకు తెలియలేదు. దోమతెరను కత్తిరించి ఎత్తుకెళ్లారు. పాప నగ్నంగా కనిపించింది. మా ఇళ్లు కూల్చేయడంతో రోడ్లపైనే బతుకుతున్నాం. మాకు ఉండటానికి ఇళ్లు లేవు, ఎక్కడికి వెళ్లాలి?' అని బాలిక అమ్మమ్మ కన్నీటి పర్యంతమయ్యారు.
 
తీవ్ర గాయాలతో ఉన్న చిన్నారిని వెంటనే తారకేశ్వర్ గ్రామీణ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
మరోవైపు, రాష్ట్రంలో జరుగుతున్న వరుస హత్యాచార కేసు ఘటనలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు సువేందు అధికారి తీవ్రంగా స్పందించారు. మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. 
 
'తారకేశ్వర్‌లో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేయలేదు. రాష్ట్రంలో శాంతిభద్రతల బూటకపు ఇమేజ్‌ను కాపాడుకోవడం కోసం పోలీసులు నిజాన్ని తొక్కిపెడుతున్నారు. ఇది మమతా బెనర్జీ పాలన అసలు స్వరూపం' అని ఆయన సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీకి చాలా అవార్డులు వస్తాయి - బీవీఎస్ రవి

Janhvi Swaroop: కౌశిక్ గోల్డ్, డైమండ్స్ ప్రచారకర్తగా జాన్వి స్వరూప్ ఘట్టమనేని

సంచలనంగా మారిన మన శంకరవర ప్రసాద్ గారు మీసాల పిల్ల సాంగ్

Mahesh Babu: మహేష్ బాబు .. బిజినెస్‌మ్యాన్ 4K ప్రింట్‌తో రీ-రిలీజ్

Kalivi Vanam: వనాలను రక్షించుకోవాలనే నేపథ్యంతో కలివి వనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

తర్వాతి కథనం
Show comments