కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్... ఖాకీల సంబరాలు

ఠాగూర్
సోమవారం, 20 అక్టోబరు 2025 (15:32 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులోని నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. ఆస్పత్రి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్య కేసులో రియాజ్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేయగా, సోమవారం ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఈ కేసు ఇంతటితో ముగిసిపోయింది.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. నిందితుడు రియాజ్‌ను అరెస్టు చేసిన తర్వాత చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. సోమవారం ఉదయం ఎక్స్‌రే కోసం తీసుకెళుతున్నారు. ఆ సమయంలో ఓ కానిస్టేబుల్ వద్ద ఉన్న తుపాకీ లాక్కొని అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణ కోసం అతనిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రియాజ్ అక్కడికక్కడే మరణించినట్టు అధికారులు తెలిపారు. 
 
మూడు రోజుల క్రితం కానిస్టేబుల్ ప్రమోద్‌ను దారుణంగా హత్య చేసిన రియాజ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలించగా, ఆదివారం సారంగపూర్ అటవీ ప్రాంతంలోని ఓ లారీలో అతను దాగివున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు అతన్ని చుట్టుముట్టి అరెస్టు చేశారు. రియాజ్‌ ఎన్‌కౌంటరులో చనిపోవడంతో ఇతర ఖాకీలు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments