Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ కప్‌లో రికార్డుల పంట.. ఆసీస్‌‌పై గెలుపు.. వరుసగా టీమిండియా రెండో విజయం

Webdunia
సోమవారం, 10 జూన్ 2019 (10:23 IST)
ప్రపంచ కప్‌లో భారత జట్టు అదరగొట్టింది. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం కెన్నింగ్టన్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రికార్డు విజయాన్ని టీమిండియా తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచకప్‌లో వరుసగా రెండో విజయాన్ని సాధించిన జట్టుగా టీమిండియా ఘనత కెక్కింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 352 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగా, లక్ష్య ఛేదనలో ఆసీస్ 316 పరుగులకే ఆలౌట్ 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 
 
ఈ మ్యాచ్‌లో గెలిచిన భారత జట్టు ఆస్ట్రేలియా పది వరుస విజయాలకు బ్రేక్ వేసినట్లైంది. అలాగే వన్డేల్లే ఆస్ట్రేలియాపై 50 విజయాలు సాధించిన మూడో జట్టుగా కూడా టీమిండియా రికార్డు సాధించింది. భారత్ కంటే ముందు ఇంగ్లండ్, వెస్టిండీస్‌లు ఈ ఘనత సాధించాయి. కాగా, ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో గతంలో మూడుసార్లు భారత్ విజయం సాధించింది.  
 
కాగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో విజయం సాధించి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోరు చేసింది. 
 
అనంతరం భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 316 పరుగులకే ఆలౌటై ప్రపంచకప్‌లో తొలి ఓటమిని నమోదు చేసింది. భారత టాప్ ఆర్డర్ రాణించడంతో జట్టు సునాయాసంగా గెలుపును నమోదు చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌గా సెంచరీ వీరుడు శిఖర్ ధావన్ నిలిచాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం గంగా నదిలో దిగింది, చూస్తుండగానే కొట్టుకుపోయింది (video)

దేశంలోనే తొలిసారి.. క్యాష్ ఆన్ వీల్ - రైలులో ఏటీఎం (Video)

నాకు తియ్యని పుచ్చకాయ కావాలి, చెప్పవే చాట్‌జీపీటీ (Video)

మంత్రివర్గం కీలకమైన సమావేశం- పవన్ కల్యాణ్ చేతికి సెలైన్ డ్రిప్

ఆ పని చేస్తే సీఎస్‌తో అధికారులందరినీ జైలుకు పంపిస్తాం : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

తర్వాతి కథనం
Show comments