Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ సేనను చిత్తుగా ఓడిస్తాం : బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హాసన్

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (11:58 IST)
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ క్రికెట్ టోర్నీలో భాగంగా, వచ్చే నెల రెండో తేదీన భారత్ - బంగ్లాదేశ్‌ల మధ్య లీగ్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేనను చిత్తుగా ఓడిస్తామని బంగ్లాదేశ్ ఆల్‍‌రౌండర్ షకీబ్ అల్ హాసన్ వెల్లడించారు. ఈ టోర్నీలో భాగంగా, ఆప్ఘన్‌తో జరిగిన మ్యాచ్‌లో హాసన్ సెంచరీతో రాణించడంతో బంగ్లాదేశ్ గెలుపొందింది. 
 
ఈ నేపథ్యంలో షకీబ్ హల్ హాసన్ స్పందిస్తూ, శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తే.. భారత్‌ను ఓడించే సత్తా బంగ్లాదేశ్‌కు ఉందన్నారు. టైటిల్ ఫేవరెట్ టీమ్‌ ఇండియాపై గెలవాలంటే జట్టులోని ఆటగాళ్లందరూ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాల్సి ఉంటుందన్నారు. టైటిల్‌పై కన్నేసిన భారత్.. అగ్రశ్రేణి జట్టు. కోహ్లీ సేనను ఓడించడం అంత తేలిక కాదన్నారు. 
 
కానీ మా వంతు ప్రయత్నం చేస్తాం. శక్తిమేర ఆడితే భారత్‌పై నెగ్గడం సాధ్యమే. ఒంటిచెత్తో మ్యాచ్‌ను గెలిపించగలవారు టీమ్‌ ఇండియాలో చాలా మంది ఉన్నారని గుర్తుచేశారు. అయితే, తమ జట్టులోని ఆటగాళ్లంతా తమ అనుభవాన్ని, నైపుణ్యాన్ని సరిగ్గా వినియోగించుకుంటే వారిని ఓడించగలిగే జట్టు మాకూ ఉందిఅని షకీబ్ వివరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

Naga Vamsi: సినిమా బాగుంటే చూస్తారు, రివ్యూర్ల రాతలు వల్లకాదు : నాగవంశీ ఫైర్

తర్వాతి కథనం
Show comments