Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ సేన జోరును ఆపతరమా? వెస్టిండీస్‌తో నేడు భారత్ ఢీ

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (11:21 IST)
ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో లీగ్ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే సెమీస్ ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో రెండో జట్టుగా న్యూజిలాండ్ ఉంటుందని ప్రతి ఒక్కరూ భావించారు. 
 
అయితే, కివీస్ జైత్రయాత్రకు పాకిస్థాన్ జట్టు బుధవారం బ్రేక్ వేసింది. పైగా, పాకిస్థాన్ జట్టు తన సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్‌లలో ఇప్పటివరకు ఓటమి అంటూ ఎరుగని రెండో జట్టుగా భారత్ ఉంది. అలాంటి కోహ్లీ సేనతో వెస్టిండీస్ జట్టు తలపడనుంది. 
 
మాంచెష్టర్ వేదికగా భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. భారత ఆడిన అన్ని మ్యాచ్‌లలో విజయం సాధిస్తూ వచ్చింది. అయితే. ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం భారత్ చెమటోడ్చి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో గురువారం వెస్టిండీస్ జట్టుతో తలపడనుంది. 
 
కోహ్లీ సేన అటు బౌలింగ్‌, ఇటు బ్యాటింగ్‌లో తిరుగులేకుండా ఉంది. ధోనీ బ్యాటింగ్‌పైనే టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఆందోళన చెందుతోంది. ముఖ్యమైన రెండో పవర్‌ ప్లేలో మిడిలార్డర్‌ రాణించడం ఎంతో కీలకంగా మారింది. కానీ మిడిలార్డర్‌లో కీలకమైన మాజీ కెప్టెన్‌ ధోనీ విఫలమవుతుండటం కలవరపరుస్తోంది. అఫ్ఘానిస్థాన్‌తో గత మ్యాచ్‌లో ధోనీ (52 బంతుల్లో 28 పరుగులు) మరీ నిదానంగా బ్యాటింగ్‌ చేయడంపై విమర్శలు వచ్చాయి. 
 
ఈ వరల్డ్ కప్ టోర్నీ లీగ్‌లో ఆడాల్సిన మ్యాచ్‌లు మరో నాలుగు ఉండడంతో ధోనీ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పు చేసే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే షాట్ల ఎంపికలో నవ్యత కనబరిచే కేదార్‌ జాదవ్‌ను మహీకంటే ముందు పంపే అవకాశాలు లేకపోలేదు. 
 
మరోవైపు, పేస్‌ బౌలింగే ఆయుధంగా వరల్డ్‌క్‌పలో అడుగుపెట్టిన వెస్టిండీస్ జట్టు... పాక్‌త జరిగిన మ్యాచ్‌లో టోర్నీలో ఏకైక విజయం అందుకుంది. న్యూజిలాండ్‌తో గత మ్యాచ్‌లో బ్రాత్‌వైట్‌ అద్భుత పోరాట పటిమ చూపడంతో విండీస్‌ గెలుపు అంచుల దాకా వచ్చి... ఐదు పరుగులతో ఓటమి చవిచూడడంతో నిరాశలో కూరుకుపోయింది. 
 
ఓపెనర్లు శుభారంభాలు అందించకపోవడం జట్టును దెబ్బతీస్తోంది. మిగిలిన బ్యాట్స్‌మెన్‌ కూడా నిలకడగా ఆడకపోవడంతో టోర్నీలో విండీస్‌ అనుకున్న ఫలితాలు సాధించ లేకపోతోంది. పించ్‌ హిట్టర్‌ రస్సెల్‌ గాయంతో దూరం కావడం మరో దెబ్బ. ఈ నేపథ్యంలో భారత్‌ను ఏమాత్రం ప్రతిఘటిస్తుందో వేచి చూడల్సిందే. 
 
ఈ మ్యాచ్ జరిగే మాంచెష్టర్‌లో వాతావరణం ఎండతో ఉక్కపోతగా ఉండనుంది. పిచ్‌ పొడిగా ఉండడంతో మ్యాచ్‌ సాగేకొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపగలరు. టోర్నీలో ఓల్డ్‌ట్రాఫర్డ్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టే గెలుపొందింది. 
 
ఇరు జట్ల అంచనాలు...
భారత్ : కోహ్లీ, రాహుల్, రోహిత్, విజయ్ శంకర్, ధోనీ, జాదవ్, పాండ్యా, కుల్దీప్, చాహల్  లేదా రవీంధ్ర జడేజా, షమీ, బుమ్రా.
 
వెస్టిండీస్ : జాసన్ హోల్డర్, క్రిస్ గేల్, ఎవిన్ లూసియ్ లేదా సునిల్ అంబ్రీస్, షాయ్ హోప్, పూరన్, హెట్‌మయర్, బ్రాత్‌వైట్, ఆష్లే నర్స్, రోచ్, కార్టెల్, ఒషానె థామస్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments