Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ సిక్సర్.. ఆదమరచి నవ్విన కోహ్లీ.. (video)

Webdunia
సోమవారం, 10 జూన్ 2019 (16:09 IST)
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌ల మధ్య ఆదివారం వరల్డ్ కప్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చోటుచేసుకున్న ఆసక్తికరమైన సన్నివేశాలను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 352 పరుగులు  సాధించింది. తద్వారా వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాతో ఆడిన జట్లలో అత్యధిక పరుగులు సాధించిన టీమ్‌గా టీమిండియా నిలిచింది. ఇది టీమిండియా వన్డేల్లో సాధించిన అత్యధిక స్కోర్లలో నాలుగోది కావడం విశేషం. 
 
ఇకపోతే.. భారత ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ మ్యాచ్‌లో శతకం సాధించడం ద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా వరల్డ్ కప్‌లో భారత క్రికెటర్ సాధించిన 27వ సెంచరీగా నిలిచింది. దీంతో వరల్డ్ కప్‌ల్లో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకుముందు ఆస్ట్రేలియా 26 శతకాలు సాధించిన జట్టుగా వుంది. ప్రస్తుతం ఆ రికార్డును భారత్ 27 శతకాలతో అధిగమించింది.  
 
ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా జట్టు లక్ష్య సాధనలో 19 మ్యాచ్‌ల్లో గెలుపును నమోదు చేసుకుంది.  కానీ భారత్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోవడం ద్వారా 20 సంవత్సరాల పాటు ఆసీస్ రికార్డుకు భారత్ తెరదించింది. 
 
అలాగే ఐసీసీ నిర్వహించే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో వరుసగా 11 విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఆస్ట్రేలియా రికార్డును కూడా భారత్ అధిగమించింది. ఇంకా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా రెండో ఓవర్లో తొలి బంతిని విసిరేటప్పుడు.. బంతి వార్నర్ కాలికి తగిలి.. స్టంప్ చివర్లను తాకింది. కానీ పెయిల్ కింద బంతి పడటంతో వార్నర్ అర్థ సెంచరీ కొట్టాడు. 
 
ముఖ్యంగా చెప్పాలంటే.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ కొట్టిన సిక్సర్ హైలైట్. ధోనీ కొట్టిన షాట్ అద్భుతమైంది. ఈ షాట్ కొట్టిన వెంటనే టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఆదమరచి నవ్వుకున్నాడు. అలాగే బాలిటన్ సింబల్‌ను తొలగించిన చేతి గ్లౌజ్‌లను ధోనీ ధరించడం చేస్తే.. ఫ్యాన్స్.. అందుకు విరుద్ధంగా చేతి గ్లౌజ్ నుంచి బాలిటన్ ముద్రను తొలిగించివుండవచ్చునేమో కానీ ఫ్యాన్స్ చేతుల్లో నుంచి ఆ ముద్రను తొలగించలేరని ప్లకార్డులతో చూపెట్టారు. ఇకపోతే... రోహిత్ శర్మ 20 పరుగులతో.. ఆస్ట్రేలియా జరిగిన మ్యాచ్‌ల్లో 2వేల పరుగుల మైలురాయిని లిఖించుకున్నాడు. తద్వారా తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే 2వేల పరుగుల మైలురాయిని లిఖించుకున్న రెండో భారత క్రికెటర్‌గా, నాలుగో అంతర్జాతీయ క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. 
 
కానీ స్పిన్నర్ షంబా బౌలింగ్‌తో మైదానంలో కాస్త కలకలం రేగింది. ప్యాంటు జేబులోని చిన్నపాటి వస్త్రంతో బంతిని రుద్దడం గమనించిన టీమిండియా ఫ్యాన్స్...  బాల్ ట్యాంపరింగ్ అంటూ కేకలేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

నా పని నేను చేస్తున్నా.. పోలీసులు వాళ్ళ పని చేస్తున్నారు.. ఆర్జేవీ పరారీపై పవన్ కామెంట్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

తర్వాతి కథనం
Show comments