Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాచ్ పట్టడంలో కొత్త నిర్వచనం.. వృద్ధి మాన్ సాహా

పుణెలో తొలి టెస్ట్ తొలి రోజు ఆసీస్ లో ఆర్డర్ బ్యాట్స్‌మన్ ఓ కీఫీ బ్యాట్ అంచును తాకి వేగంగా వెళ్లిపోతున్న బంతిని సాహా కుడివైపు డైవ్ చేసి గాల్లో తేలుతూ పట్టాడు. క్షేమంగే మైదానాన్ని తాకాడు. ఆ క్షణం కెప్టెన్ కోహ్లీ సహా అందరూ ఆ ఫీట్‌కి ఆశ్చర్యపోయారు. ఇది

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (05:54 IST)
పుణెలో తొలి టెస్ట్ తొలి రోజు ఆసీస్ లో ఆర్డర్ బ్యాట్స్‌మన్ ఓ కీఫీ బ్యాట్ అంచును తాకి వేగంగా వెళ్లిపోతున్న బంతిని సాహా కుడివైపు డైవ్ చేసి గాల్లో తేలుతూ పట్టాడు. క్షేమంగే మైదానాన్ని తాకాడు. ఆ క్షణం కెప్టెన్ కోహ్లీ సహా అందరూ ఆ ఫీట్‌కి ఆశ్చర్యపోయారు. ఇది అతని కెరీర్‌లో మరువలేని క్యాచ్ అవుతుందంటూ అందరూ అభినందనలతో ముంచెత్తారు. పుణె బ్యాట్‌మాన్.. కాదు! సూపర్‌మాన్.. కాదు! మరెవరు.. అది వృద్ధిమాన్. టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా సూపర్బ్ క్యాచ్‌కు క్రికెట్ దిగ్గజాలు, అభిమానులు ఫిదా అయిపోయారు. ఆ బెంగాల్ ఆటగాడి పేరు గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో మార్మోగిపోయింది. 
 
తొలి టెస్టు మ్యాచ్‌లో 82వ ఓవర్. ఉమేష్ యాదవ్ బౌలింగ్. నాలుగో బంతి...141 కి.మీ. వేగంతో సంధించాడు. ఆ బంతిని ఓ కీఫీ కట్ చేద్దామనుకున్నాడు. బ్యాట్ అంచును తాకి సాహా, ఫస్ట్ స్లిప్‌లో ఉన్న కోహ్లీ మధ్య నుంచి వెళ్ళిపోతోందనుకున్నారు. ఇంతలో సాహా బంతిపైకి లంఘించి.. గాల్లోనే ఉండి ఒడిసిపట్టాడు. పక్కనున్న కోహ్లీ ఆశ్చర్యపోయాడు. సాహాను గట్టిగా హత్తుకుని అభినందించాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే ఉమేష్ ‘హ్యాట్సాఫ్ సాహా’ అని కొనియాడాడు. రోహిత్ శర్మ ‘ఫ్లయింగ్ సాహా’ అని అభివర్ణించాడు. ఆకాష్ చోప్రా, మహ్మద్ కైఫ్, దీప్ దాస్ గుప్తా సహా ఎందరెందరో సోషల్ మీడియాలో సాహాపై ప్రశంసల జల్లు కురిపించారు.
 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

తర్వాతి కథనం
Show comments