Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేంద్ర సింగ్ ధోనీ కాదు.. మహేంద్ర బాహుబలి.. ఆకాశానికెత్తిన సెహ్వాగ్

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' మేనియా భారత క్రికెట్లోనూ ఏ మేరకు ఉందో వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా చేసిన కామెంట్ చెబుతోంది. ఐసీసీ చాంపియన్స్‌లో టోర్నీలో భాగంగా లండన్‌లోని ఓవల్ మైదానంలో గురువారం శ్రీలంక, భారత్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో మాజీ

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (06:16 IST)
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' మేనియా భారత క్రికెట్లోనూ ఏ మేరకు ఉందో  వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా చేసిన కామెంట్ చెబుతోంది. ఐసీసీ చాంపియన్స్‌లో టోర్నీలో భాగంగా లండన్‌లోని ఓవల్ మైదానంలో గురువారం శ్రీలంక, భారత్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ధనా ధన్ ఇన్నింగ్స్‌ను మెచ్చుకుంటూ ఓ ముద్దుపేరు పెట్టేశాడు సెహ్వాగ్. 
 
కామెంటరీ బాక్స్‌లో ఉన్న ఈ డాషింగ్ ఓపెనర్.. ధోనీ హాఫ్ సెంచరీ చేశాక అతడి బలాన్ని గురించి చెబుతూ.. అతడు మహేంద్ర సింగ్ ధోనీ కాదు.. మహేంద్ర 'బాహుబలి' అని కామెంట్ చేశాడు. మరి దీనికి కారణం ఉంది కూడా.. ధోనీ 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 52 బంతుల్లో 63 పరుగులు చేశాడు. వన్డే కెరీర్‌లో అతడికిది 62వ హాఫ్ సెంచరీ. ఇంత ఘనంగా ఆడినప్పటికీ శ్రీలంక చేతిలో భారత్ ఓడిపోవడం కలుక్కుమనిపిస్తుంది కానీ ధోనీ మెరుపువేగంతో చేసిన అర్థ సెంచరీ చిరస్మరణీయమైనదే. 
 
అయితే మహీని బాహుబలి అనడంతో ప్రస్తుతం ట్విట్టర్లో దీనిపై కామెంట్లు వెల్లువలా వస్తున్నాయి. ఇకనుంచి అందరూ మహేంద్ర బాహుబలి అని పిలవాలని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వందల కోట్ల హృదయాలను గెలుచుకున్న క్రికెట్ బాహుబలి ధోనీ అంటూ మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. భారత్ మ్యాచ్ ఓడింది కానీ.. సెహ్వాగ్ కామెంటరీ మాత్రం సక్సెస్ అయింది. 
 
ట్విట్టర్‌లో వీరూ కామెంట్, దానికి వచ్చిన స్పందనలను ఇక్కడ చూడండి. 
 
Mahendra Bahubali. 
 
Only this two players knows why ball goes that fast when Dhoni hits it.
 
I appreciate it & liked it very much. Dhoni has the power of Bahubali & since he is Mahendra singh, right to call him Mahendra Bahubali. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Rain Alert: ఆంధ్రప్రదేశ్- తెలంగాణల్లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు

Andhra Pradesh: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ఏపీ సర్కారు చర్యలు

భారత రక్షణ వ్యవస్థ... అలనాటి ఆస్ట్రేలియా బౌలర్లలా ఉంది : డీజీఎంవో

శత్రువు పాకిస్థాన్‌ను ఇలా చితక్కొట్టాం : వీడియోను రిలీజ్ చేసిన ఇండియన్ ఆర్మీ (Video)

తెలంగాణలో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో ప్రదర్శించనున్న జో శర్మ థ్రిల్లర్ మూవీ M4M

అలసట వల్లే విశాల్‌ స్పృహతప్పి కిందపడిపోయారు : వీఎఫ్ఎఫ్ స్పష్టీకరణ (Video

తర్వాతి కథనం
Show comments