Webdunia - Bharat's app for daily news and videos

Install App

జట్టు బాగుంటే కెప్టెన్సీ కూడా బాగుంటుంది: సమిష్టికి పట్టం కట్టిన కోహ్లీ

బంగ్లాదేశ్‌ను, ఆస్ట్లేలియాను సమానంగానే గౌరవిస్తామని, అదే దృక్పథంతో పాజిటివ్‌గా ఆడతామని టీ్మిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. నేటి నుంచి భారత్-ఆసీస్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమవుతున్న సందర్భంగా మీడియోతో మాట్లాడిన కోహ్లీ తన కెప్టెన్సీ కంటే జట్

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2017 (04:20 IST)
బంగ్లాదేశ్‌ను, ఆస్ట్లేలియాను సమానంగానే గౌరవిస్తామని, అదే దృక్పథంతో పాజిటివ్‌గా ఆడతామని టీ్మిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. నేటి నుంచి భారత్-ఆసీస్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమవుతున్న సందర్భంగా మీడియోతో మాట్లాడిన కోహ్లీ తన కెప్టెన్సీ కంటే జట్టు కూర్పు గురించే నా ఆలోచన సాగుతోందని చెప్పుకొచ్చాడు. వేసవి ఆరంభంలో భారత్‌లో పిచ్‌లు పొడిగా ఉండి స్పిన్‌కు అనుకూలించడం సహజం. అంతే తప్ప ఆ ఒక్కటీ మాత్రమే జట్టుకు అనుకూలమైన అంశం కాదని. ఆసీస్‌ జట్టుతో ఆట అంటే చెమటోడ్చక తప్పదని పేర్కొన్నాడు.
 
నా కెప్టెన్సీ గురించి విశ్లేషించేందుకు ఇది సరైన సమయం కాదు. మరికొన్నేళ్ల తర్వాత కూడా నేను కెప్టెన్‌గానే ఉంటే అప్పుడు ఆలోచించవచ్చు. జట్టు బాగా ఆడినప్పుడే కెప్టెన్సీ కూడా బాగుంటుంది. అయితే నాయకుడినయ్యాక నా ఆట ఇంకా మెరుగు పడిందని మాత్రం చెప్పగలను. మా దృష్టిలో అన్ని సిరీస్‌లూ సమానమే. బంగ్లాదేశ్‌లాగే ఆస్ట్రేలియా జట్టును కూడా గౌరవిస్తాం. ఈ సీజన్‌లో అన్ని జట్లు మాకు గట్టిపోటీనే ఇచ్చాయి. ఈ వేసవి ఆరంభంలో భారత్‌లో పిచ్‌లు పొడిగా ఉండి స్పిన్‌కు అనుకూలించడం సహజం అని భారత్ కెప్టెన్ కోహ్లీ తెలిపాడు.
 
మరోవైపున తాను 4-0 తేడాతో ఓడిపోతామని పలువురు క్రికెటర్లు చేస్తున్న వ్యాఖ్యలను ఆసీస్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ తోసిపుచ్చాడు. భారత్‌లో మాకు కఠినమైన సీరీస్ కాబోతుందని ఒప్పుకుంటాను కానీ అంత సులభంగా మ్యాచ్‌ను చేజార్చుకోమని స్మిత్ అన్నాడు. 
 
మాకు సంబంధించి ఇది కఠినమైన సిరీస్‌ కాబోతుందని తెలుసు. భారత జట్టులో 1 నుంచి 11 వరకు కూడా నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. 0–4తో సిరీస్‌ ఓడిపోతామని కొందరు చేసిన వ్యాఖ్యలకు నేను ప్రాధాన్యతనివ్వను. మా జట్టుకు భారత్‌కు గట్టి పోటీ ఇవ్వగల సామర్థ్యం ఉంది. సిరీస్‌ హోరాహోరీగా జరుగుతుంది. పేసర్‌ స్టార్క్‌ ఇక్కడా మా ప్రధాన ఆయుధం కాగలడు. శ్రీలంక సిరీస్‌ పరాజయం మాకు పాఠాలు నేర్పింది. ఈ సారి తగిన వ్యూహాలతో వచ్చాం.
 
పుణెలో గురువారం ఇరు జట్ల మధ్య జరుగనున్న తొలి టెస్టు ఉదయం గం. 9.30ల నుంచి ప్రారంభమవుతుంది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments