Webdunia - Bharat's app for daily news and videos

Install App

చావో రేవో అంటున్న లంక... సెమీ ఫైనల్‌ లక్ష్యంగా టీమిండియా

గురువారం శ్రీలంకతో ఓవెల్‌ మైదానంలో తలపడనున్న భారత్ జట్టు సెమీ ఫైనలే లక్ష్యంగా పెట్టుకోగా సెమీస్ పోరులో నిలవాలంటే గెలుపు సాధించక తప్పని ఒత్తిడిలో శ్రీలంక బరిలో దిగుతోంది. చాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్‌ అమితోత్సాహంతో ఉంది. అ

Webdunia
గురువారం, 8 జూన్ 2017 (07:51 IST)
గురువారం శ్రీలంకతో ఓవెల్‌ మైదానంలో తలపడనున్న భారత్ జట్టు సెమీ ఫైనలే లక్ష్యంగా పెట్టుకోగా సెమీస్ పోరులో నిలవాలంటే గెలుపు సాధించక తప్పని ఒత్తిడిలో శ్రీలంక బరిలో దిగుతోంది. చాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్‌ అమితోత్సాహంతో ఉంది. అన్ని రంగాల్లో జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన శ్రీలంక తమ బలహీనతను చూపించింది. కెఫ్టెన్ మాథ్యూస్‌ గాయపడటం, మరో కీలక ఆటగాడు ఉపుల్ తరంగ నిషేధంతో మ్యాచ్‌కు దూరం కావడంతో శ్రీలంకపై భారత్ విజయం ఏకపక్షంలానే కనిపిస్తోంది. 
 
నాలుగేళ్ల కిందట ఇంగ్లండ్‌లోనే జరిగిన చాంపియన్స్‌ట్రోఫీలో విజేతగా నిలిచిన భారతజట్టు మరోసారి అలాంటి ప్రదర్శనే పునరవృతం చేయాలని భావిస్తోంది. టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడిన తొలిమ్యాచ్‌లో భారత్‌ అన్ని విభాగాల్లో రాణించింది.  మరోవైపు  టైటిల్‌ ఫేవరెట్‌ భారత్‌కు లంక ఏమాత్రం పోటీనిచ్చే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో ఈ మ్యాచ్‌లో నెగ్గి రెండు వరుస విజయాలతో సెమీస్‌లోకి అడుగుపెట్టాలని టీమిండియా భావిస్తోంది. 
 
2015 వన్డే ప్రపంచకప్‌ తర్వాత దిగ్గజాలు మహేల జయవర్దనే, కుమార సంగక్కర జట్టు నుంచి వీడ్కోలు తీసుకోవడంతో లంక జట్టు సంధి దశలో ఉంది. అప్పటి నుంచి ఇప్పటి దాక నమ్మకమైన బ్యాట్స్‌మెన్‌ కొరత జట్టును వేధిస్తోంది. దీంతో ఈ టోర్నీలో లంక పోరు నామమాత్రంగానే ఉండనుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలిపోరులో 96 పరుగులతో చిత్తుగా ఓడింది. దీంతో భారత్‌తో పోరులో దూకుడు చూపించాల్సిందేనని మాజీ క్రికెటర్‌ సంగక్కర.. యువక్రికెటర్లకు ఉద్బోధించాడు. 
 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments