ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్: భారత్ కొంప ముంచిన నోబాల్స్.. భువి మినహా బౌలర్లు మొత్తంగా విఫలం

ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ డెత్ బౌలర్, యార్కర్ల రారాజుగా పేరొందిన బూమ్రా కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో ఇంతగా కొంప ముంచుతాడని ఎవరనుకున్నారు? టీమిండియా కీలక స్పిన్నర్లు ఓవర్‌కు ఏడుపరుగుల చొప్పున పరుగులు సమర్పిస్తారమని ఎవరు కలగన్నారు? మహాభారతంలో కర్ణుడి చ

Webdunia
ఆదివారం, 18 జూన్ 2017 (20:19 IST)
ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ డెత్ బౌలర్, యార్కర్ల రారాజుగా పేరొందిన బూమ్రా కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో ఇంతగా కొంప ముంచుతాడని ఎవరనుకున్నారు? టీమిండియా కీలక స్పిన్నర్లు ఓవర్‌కు ఏడుపరుగుల చొప్పున పరుగులు సమర్పిస్తారమని ఎవరు కలగన్నారు? మహాభారతంలో కర్ణుడి చావుకు ఆరుగురు కారణమంటారు కానీ ఈరోజు టీమిండియా వైఫల్యానికి బౌలర్లు మొత్తంగా కారకులంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ప్రతి సెషన్‌లోనూ బౌలర్లు చేసిన తప్పిదాలు కీలకమ్యాచ్‌లో భారత్‌ను దెబ్బతీశాయి.
 
భారత్ బౌలర్ల నిర్లక్ష్యపు బౌలింగ్ వల్ల మూల్యం చెల్లించుకున్న సందర్భాలు అనేకం. ప్రధానంగా నో బాల్స్ వల్ల భారత్ అనేక కీలక మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. తాజాగా చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌తో జరుగుతున్న తుది పోరులో సైతం భారత్ జట్టు నిర్లక్ష్యపు బౌలింగ్ వల్ల భారీ మూల్యం చెల్లించుకుంది. భారత ప్రధాన పేసర్ బూమ్రా వేసిన నాల్గో ఓవర్ తొలి బంతి పాకిస్తాన్ ఓపెనర్ ఫకార్ జమాన్ బ్యాట్ ను తాకి వికెట్ కీపర్ ధోని చేతుల్లో పడింది. 
 
అయితే అది నో బాల్ కావడంతో జమాన్ బతికిపోయాడు. అప్పుడు ఫకార్ జమాన్ వ్యక్తిగత స్కోరు 3. కాగా, ఆపై రెచ్చిపోయిన జమాన్ ఏకంగా సెంచరీ సాధించి పాక్ భారీ స్కోరుకు బాటలు వేశాడు. 2016లో జరిగిన ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20 గుర్తుంది కదా. వెస్టిండీస్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అప్పుడు బూమ్రా వేసిన నో బాల్ వల్లే విండీస్ సునాయాసంగా గెలిచి ఫైనల్‌కు చేరింది. లెండిల్ సిమన్స్ ను మొదట్లోనే బూమ్రా అవుట్ చేసినప్పటికీ, అది నో బాల్ కావడంతో అతను బతికిపోయాడు. ఆపై మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడాడు. 51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 82 పరుగులతో అజేయంగా నిలిచి విండీస్ ను ఫైనల్ కు చేర్చాడు.
 
ఇప్పుడు పాకిస్తాన్ మ్యాచ్ లో జమాన్ శతకంతో మెరవడం ఆ ఘటనను గుర్తుకు తెస్తుంది. ఈ రోజు మ్యాచ్‌లో బూమ్రా వేసిన నో బాల్‌తో లైఫ్ వచ్చిన ఫకార్ దాన్ని చక్కగా  సద్వినియోగం చేసుకుని సెంచరీ సాధించాడు. 92 బంతుల్లో శతకం చేసి పాకిస్తాన్‌ను పటిష్ట స్థితికి చేర్చాడు. ఒకవేళ మ్యాచ్‌లో ఫలితం పాకిసాన్‌కు అనుకూలంగా ఉంటే మాత్రం అందుకు బూమ్రా నో బాలే కారణం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

61 మంది మహిళలపై లైంగిక వేధింపులు.. భారత సంతతి వ్యక్తికి 14 ఏళ్ల జైలు శిక్ష

బక్రీద్ పండుగ - ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షల రీ-షెడ్యూల్

భూమి కోసం అక్కను కత్తితో పొడిచి చంపేసిన తమ్ముడు

బరాకా అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి : ఇరాన్ చర్యేనా?

ఆరు నెలల్లో టీవీకే ప్రభుత్వం కుప్పకూలిపోతుంది : డీఎంకే ఎమ్మెల్యే జోస్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బండి త‌ర్వాత నటుడిగా కెరీర్ పూర్తిగా మారింది: రాగ్ మ‌యూర్‌

Jonnavithula: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో వస్తున్న మూవీ లలిత

Mega158: మెగా158 కోసం జిమ్ వర్కౌట్‌ను పంచుకున్న చిరంజీవి

Manchu Manoj: డేవిడ్ రెడ్డి టీజర్ తో రా కింగ్ ట్యాగ్ తో వస్తున్న మంచు మనోజ్

క్రికెటర్ తిలక్ వర్మతో శ్రీలీల రిలేషన్... సోషల్ మీడియాలో పుకార్లు

తర్వాతి కథనం
Show comments