Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయాన్ని లిఖించిన ఆ రెండు అద్భుత బంతులు.. టీమిండియా కొత్త ఆయుధం కేదార్ జాదవ్

టీమిండియా అద్భుత ఆయుధంగా కేదార్ జాదవ్ ఆవిర్భవిస్తున్నాడా.. బ్యాటింగులో ధోనీకి ప్రతిరూపంలా తయారైన ఈ రెండో మిస్టర్ కూల్ గురువారం జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో జోరుమీదున్న బంగ్లా బ్యాటింగ్ లైనప్‌ను ఎత్తి కుదేశాడు. అది ఎంత బలమైన కుదుపు అంటే టీమిండియాక

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2017 (03:06 IST)
టీమిండియా అద్భుత ఆయుధంగా కేదార్ జాదవ్ ఆవిర్భవిస్తున్నాడా.. బ్యాటింగులో ధోనీకి ప్రతిరూపంలా తయారైన ఈ రెండో మిస్టర్ కూల్ గురువారం జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో జోరుమీదున్న బంగ్లా బ్యాటింగ్ లైనప్‌ను ఎత్తి కుదేశాడు. అది ఎంత బలమైన కుదుపు అంటే టీమిండియాకు సునాయాస విజయాన్ని కట్టబెట్టిన కుదుపు మరి. బంగ్లా జట్టులోని కీలక ఆటగాళ్లు తమీమ్, ముష్పికర్ వికెట్లను కేదార్ జాదవ్ రెండు బంతుల్లో పడగొట్టిన వైనం చూసి టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ కడుపుబ్బు నవ్వుతూ కేదార్‌ను బలంగా హత్తుకున్నాడంటేనే  రెండో సెమీ ఫైనల్లో కేదార్ ఆటను ఎంతగా మలుపు తిప్పాడో అర్థమవుతుంది. 
 
కొన్నాళ్ల క్రితమే కివీస్‌పై అనూహ్య బౌలింగ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న కేదార్‌ జాదవ్‌ ఈ సారి కీలక మ్యాచ్‌లో కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెట్టాడు. భారత ఐదో బౌలర్‌ పాండ్యా 3 ఓవర్లలో 28 పరుగులు ఇవ్వడంతో మరో ప్రత్యామ్నాయం కావాల్సి వచ్చింది. ఈ దశలో జాదవ్‌ స్లో ఆఫ్‌ స్పిన్‌ భారత్‌కు కీలక వికెట్లు అందించింది. ముందుగా జాదవ్‌ వేసిన బంతిని స్లాగ్‌ స్వీప్‌ ఆడబోయిన ప్రధాన బ్యాట్స్‌మన్‌ తమీమ్‌ బౌల్డయ్యాడు. ఆ తర్వాత జాదవ్‌ బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్‌ ఆడబోయే ప్రయత్నం చేసిన ముష్ఫికర్, మిడ్‌ వికెట్‌లో కోహ్లికి సునాయాస క్యాచ్‌ ఇచ్చాడు. ఆ సమయంలో కోహ్లి ప్రదర్శించిన హావభావాలు ఈ వికెట్‌ విలువను చూపించాయి. 
 
ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన బంగ్లా జట్టును ఆదుకున్న  ఇద్దరు కీలక ఆటగాళ్లను కేదార్ అద్భుత బంతులతో పని పట్టాడు. ఫలితంగా 325కు పైబడిన పరుగులు చేస్తుందని భావించిన బంగ్లా జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 264 పరుగులతోనే సరిపెట్టుకోగలిగింది. అంతకు ముందు ఆడిన 18 అంతర్జాతీయ వన్డే పోటీల్లో కేవలం 6 వికెట్లు మాత్రమే సాధించిన కేదార్ గురువారం నాటి రెండే సెమీఫైనల్లో బంగ్లా జట్టు టాప్ స్కోరర్లు తమిమ్ ఇక్బాల్ (70), ముష్ఫికర్ రహీమ్ (61)ల వికెట్లను పడగొట్టి గేమ్‌ను మలుపు తిప్పాడు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడు బీజేపీ శాఖ నన్ను పక్కనబెట్టేసింది.. సినీ నటి ఖుష్బూ

నింగికి ఎగసిన PSLVC60-SpaDex.. 220 కిలోల బరువుతో పైకి లేచిన రాకెట్

తెలంగాణ సిఫార్సు లేఖలకు ఏపీ ఆమోదం.. గురువుకు శిష్యుడు కృతజ్ఞతలు

మహిళలు బయటకు కనిపించేలా కిటికీలు ఏర్పాటు చేయవద్దు : తాలిబన్ నయా రూల్

ఇథియోపియాలో ఘోర రోడ్డు ప్రమాదం: 71 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akira: సాదాసీదాగా కాశీలో అకీరా, ఆద్య.. బాగా పెంచారని రేణు దేశాయ్‌కి కితాబు (video)

అభిమానులకూ, తల్లిదండ్రులకు పాఠాలు నేర్పిన 2024 సినిమా రంగం- స్పెషల్ స్టోరీ

కథానాయకుడు యష్ ను హీరోలంతా ఆదర్శకంగా తీసుకోవాలి

బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్

SreeLeela: ఏ చెడును పోస్ట్ చేయవద్దు.. సెలెబ్రిటీల మద్దతు (video)

తర్వాతి కథనం
Show comments