Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలేఖని ఎంచుకున్న సచిన్‌ టెండూల్కర్

Webdunia
మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (19:25 IST)
సంచరీల సెంచరీ చేసిన సచిన్ తెలుగమ్మాయి చిన్నతనం నుంచే సినిమాలకి సంగీతం అందిస్తున్న ఎం ఎం శ్రీలేఖకి క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. వివరాల్లోకి వెళితే, ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలవబోతున్న ఫుట్‌బాల్‌ లీగ్‌లో పాల్గొనబోతున్న కేరళ బ్లాస్టర్స్‌ టీం కోసం కంపోజ్ చేసిన థీం సాంగ్స్‌లో.. శ్రీలేఖ చేసిన పాట విని ముగ్ధుడైన మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ వెంటనే ఆ పాటకి ఓకే చేశారు. కొచ్చిలో ఈ రోజున జరిగిన కేరళ బ్లాస్టర్స్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పాటని సచిన్‌ ఆవిష్కరించి, కేరళ బ్లాస్టర్స్‌ విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. 
 
శ్రీలేఖ అందించిన ఈ పాట ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని, చిన్నప్పుడే సంగీత సారధ్యం చేయడం మొదలుపెట్టి.. స్త్రీలందరికీ ఆదర్శంగా నిలిచినందుకు శ్రీలేఖకు అభినందనలు తెలిపారు. 75 సినిమాలకు మ్యూజిక్‌ అందించడం మామూలు విషయం కాదనీ, త్వరలో సెంచరీ చేయాలని అభినందనలు తెలిపారు. 
 
శ్రీలేఖ మాట్లాడుతూ, తను చిన్నప్పటి నుంచీ సచిన్‌ అభిమానిననీ, ఈ రోజు తాను కేరళ బ్లాస్టర్స్‌ కోసం చేసిన పాటని సచిన్‌ ఆవిష్కరించడం ఓ అద్భుతంగా ఉందని అన్నారు. ఈ పాటని శ్రీలేఖతో కలిసి కళాభవన్‌ మణి ఆలపించారు. కార్యక్రమంలో కేరళ బ్లాస్టర్స్‌ క్రీడాకారులు, డేవిడ్‌ జేమ్స్‌, రాజీవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments