Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ వైపు గంగూలీ అడుగులు.. కమలనాథులతో చర్చలు!

Webdunia
గురువారం, 22 జనవరి 2015 (12:39 IST)
టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ వ్యాఖ్యాత సౌరభ్ గంగూలీ బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే గురువారం బీజేపీ పెద్దలతో సమావేశమైన గంగూలీ వారితో చర్చిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. 2008లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న గంగూలీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కీలక సభ్యుడిగా ఉండటమే కాకుండా క్రికెట్ వ్యాఖ్యాతగా మారిన విషయం తెల్సిందే. 
 
వెస్ట్ బెంగాల్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించిన విషయం తెల్సిందే. ఇందుకోసం కమలనాథులు చాపకింద నీరులా తమ ప్రణాళికలకు పదునుపెడుతున్నారు. ఇందులోభాగంగా ఆ రాష్ట్రంలో ఉన్న ప్రముఖులను తమ వైపుకు ఆకర్షించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు. 
 
దీంతో గుంగూలీతో బీజేపీ అధిష్టాన సీనియర్ నేతలు చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. చర్చలు సఫలమైతే గంగూలీ బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. భారతీయ క్రికెట్ ప్రముఖ వ్యక్తులో ఒకరైన గంగూలీకీ భారీ అభిమానగణం ఉంది. ప్రత్యేకంగా బెంగాల్లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెల్సిందే. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments