Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుమైమాతో లింకు లేదు సానియా మీర్జాతో బాగానే ఉంటున్నా : షోయబ్ మాలిక్!

Webdunia
శుక్రవారం, 19 డిశెంబరు 2014 (12:24 IST)
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ దాంపత్య జీవితం ఒడిదుడుకుల్లో పడిందని ఇటీవల మీడియాలో వచ్చిన కథనాలపై పాకిస్థాన్ క్రికెటర్ స్పందించారు. తమ వైవాహిక జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు గానీ లేదా విభేదాలు కానీ లేవని చెప్పుకొచ్చారు. 
 
తమ వైవాహిక జీవితం సాఫీగానే సాగుతోందని స్పష్టం చేశాడు. తమ మధ్య దృఢమైన బంధం నెలకొని ఉందని తెలిపాడు. సానియా, తాను దుబాయ్‌లోనే కలిసి ఉంటున్నట్టు గుర్తు చేశాడు. అంతేకాకుండా వీలైనంత ఎక్కువ సమయం ఇద్దరం కలిసి గడిపేందుకు ఇష్టపడుతున్నట్టు చెప్పుకొచ్చాడు. 
 
అదేసమయంలో పాకిస్థాన్ నటి హుమైమా‌తో తనకు ఎలాంటి అఫైర్స్ లేదని స్పష్టం చేశాడు. కేవలం తమ మధ్య స్నేహబంధం మాత్రమే ఉందన్నారు. తన వైవాహిక జీవితంపై వస్తున్న ఇలాంటి నిరాధారమైన వార్తలు చికాకు పరుస్తున్నాయని అన్నాడు. మరోవైపు.. సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌లు త్వరలోనే విడిపోనున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments