Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిల్ హ్యూజెస్ పరిస్థితి విషమం: తలకు బంతి బలంగా తగిలి..?

Webdunia
మంగళవారం, 25 నవంబరు 2014 (14:13 IST)
ఆసీస్ యువ బ్యాట్స్‌మెన్ ఫిల్ హ్యూజెస్ (25) పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయాన్ని డాక్టర్లు నిర్ధారించారు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో న్యూ సౌత్ వేల్స్ - సౌత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ సందర్భంగా ఫిల్ తీవ్రంగా గాయపడ్డాడు. 
 
ఇండియాతో జరగనున్న టెస్ట్ సిరీస్‌లో గాయపడ్డ మైఖేల్ క్లార్క్ స్థానంలో ఫిల్‌కు పిలుపు వస్తుందని అందరూ భావిస్తున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంచి ఫామ్‌లో ఉన్న ఫిల్ హ్యూజెస్ షెఫీల్డ్ మ్యాచ్‌లో కూడా 63 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు
 
ఈ నేపథ్యంలో షాన్ అబాట్ విసిరిన బౌన్సర్‌ను తప్పుగా అంచనా వేసిన ఫిల్... హుక్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ సందర్భంగా అతని తల పక్క భాగాన్ని బంతి బలంగా తాకింది. దీంతో పిచ్ మీద ఫిల్ హ్యూజెస్ కుప్పకూలిపోయాడు. వెంటనే ఫిల్‌ను మూడు అంబులెన్సులు, ఒక హెలికాప్టర్ సహాయంతో ఆసుపత్రికి తరలించారు. 
 
ఫిల్‌ను పరీక్షించిన వైద్యులు అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఫిల్‌కు అత్యవసర చికిత్స కొనసాగుతోంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments