Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌరవ్ గంగూలీ బీజేపీలో చేరట్లేదు: సిద్ధార్థ్ స్పష్టం

Webdunia
గురువారం, 22 జనవరి 2015 (17:44 IST)
టీమిండియా కెప్టెన్, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ బీజేపీలో చేరుతున్నారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని జాతీయ కార్యదర్శి సిద్ధార్థ్ నాథ్ సింగ్ తోసిపుచ్చారు. గంగూలీకి పార్టీ నేతలతో సత్సంబంధాలున్నాయని.. ఆయనంటే తమకెంతో గౌరవమన్నారు.
 
2008లో రిటైరైన తర్వాత క్రికెట్ వ్యాఖ్యాతగా, బెంగాల్ క్రికెట్ సంఘంలో పనిచేసిన గంగూలీ బీజేపీ అగ్రనాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఓ ప్రముఖ ఆంగ్ల టీవీ ఛానెల్ పేర్కొన్న విషయం తెలిసిందే. గతేడాది ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టాత్మక ‘స్వచ్ఛ భారత్’ ప్రాజెక్టుకు గంగూలీతోపాటు మరికొంతమందిని ఎంపిక చేశారు.
 
ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలతో సౌరవ్ గంగూలీ సంప్రదింపులు జరుపుతున్నారని, తద్వారా గంగూలీ బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని బీజేపీ గురువారం స్పష్టం చేసింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments