Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ 11 రోజులు నరకం చూశాం.. జమ్మూ వరదలపై రసూల్!

Webdunia
మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (11:46 IST)
జమ్మూ కాశ్మీర్‌ను ముంచెత్తిన వరదల్లో తన కుటుంబం కూడా చిక్కుకుందని ఆ రాష్ట్రానికి చెందిన భారత క్రికెటర్ పర్వేజ్ రసూల్ తెలిపాడు. తమ ఇంటిని కూడా వరద ముంచెత్తిందని రసూల్ చెప్పాడు. వరదలు అనంతనాగ్ జిల్లాను ముంచెత్తినప్పుడు రసూల్ బిజ్బెహరాలోని తన నివాసంలో ఉన్నాడు. 
 
గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నీళ్లలో మునిగిపోవడంతో, మొదటి అంతస్తులోనే ఉన్నామని, ఇంటి నుంచి బయటపడే అవకాశం లేకపోయిందని సోమవారం పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు. ఈ 11 రోజులు బాహ్య ప్రపంచంలో సంబంధం తెగిపోయిందన్నాడు.
 
గత 11 రోజులపాటు నరకం చూశాం. బయట అందరితోనూ సంబంధాలు తెగిపోయాయి. మేముంటున్న అనంతనాగ్‌లో టెలిఫోన్‌లు, మొబైల్ ఫోన్లు.. ఏవీ పని చేయలేదు. నేను, నా కుటుంబసభ్యులు నిస్సహాయ స్థితిలో ఉండిపోయాం' అని రసూల్ తెలిపాడు. ఇప్పుడిప్పుడే పరిస్థితి మెరుగుపడిందని పర్వేజ్ రసూల్ చెప్పాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments