Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత జట్టుకు షాక్... ఇషాంత్ శర్మ దూరం.. ఇంగ్లండ్ బ్యాటింగ్!

Webdunia
ఆదివారం, 27 జులై 2014 (15:44 IST)
సౌతాంఫ్టన్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన మూడో టెస్టులో భారత క్రికెట్ జట్టుకు మ్యాచ్ ఆరంభానికి ముందే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా లార్డ్స్ టెస్ట్ హీరో ఇషాంత్ శర్మ తుది జట్టుకు దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో పంకజ్ సింగ్‌ను ఎంపిక చేశారు. అలాగే, స్టువర్ట్ బిన్నీకి అనూహ్యంగా విశ్రాంతినిచ్చి రోహిత్ శర్మకు చోటు కల్పించారు. 
 
మరోవైపు.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగియగా, రెండో టెస్టులో ధోనీ సేన విజయభేరీ మోగించిన విషయం తెల్సిందే. ఈ టెస్టులో భారత్‌ను ఇషాంత్ శర్మ ఒంటి చెత్తో గెలిపించిన విషయం తెల్సిందే. 
 
ఈ మ్యాచ్‌ కోసం ప్రకటించిన ఇరు జట్ల వివరాలు ఇలా ఉన్నాయి. 
భారత్ : మురళీ విజయ్, శిఖర్ ధావన్, పుజారా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రెహానే, ధోనీ, జడేజా, భువనేశ్వర్ కుమార్, మొహ్మద్ షమీ, పంకజ్ సింగ్. 
 
ఇంగ్లండ్ : కుక్, రూబ్సన్, బ్యాలెన్స్, బెల్, రూట్, అలీ, బట్లర్, వోక్స్, జోర్డాన్, బ్రాడ్, ఆండర్సన్. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments