Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాక్టీసుకు ధోనీ డుమ్మా.. సచిన్‌ను చూసి నేర్చుకున్నాడా?

Webdunia
గురువారం, 14 ఆగస్టు 2014 (11:54 IST)
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రాక్టీసుకు డుమ్మా కొట్టాడు. చివరి టెస్టు శుక్రవారం ఆరంభం కానుండగా, ఇప్పటికే బ్యాటింగ్ వైఫల్యంతో దారుణ పరాభవాలు చవిచూసిన టీమిండియా నెట్ ప్రాక్టీసును సీరియస్‌గా తీసుకోలేదు. అటు కెప్టెన్‌గా, ఇటు బ్యాట్స్‌మన్‌గా విఫలమవుతున్న ధోనీ నెట్స్‌లో చెమటోడ్చితే కాసింత ఫలితం ఉంటుందన్నది క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఇంతకుముందు 2003 వరల్డ్ కప్ సందర్భంగా బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నెట్ ప్రాక్టీసు లేకుండా బరిలో దిగి టన్నుల కొద్దీ పరుగులు సాధించడాన్ని ఇప్పుడు టీమిండియా కెప్టెన్ స్ఫూర్తిగా తీసుకున్నాడేమోనని వారు చమత్కరిస్తున్నారు.
 
కాగా, ధోనీ గైర్హాజరీతో వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ డంకన్ ఫ్లెచర్ ల పర్యవేక్షణలో టీమిండియా ప్రాక్టీసు కొనసాగింది. ఇదిలావుంటే, భారత్ కు ఐదో టెస్టు ముంగిట ఓ శుభవార్త. గాయంతో రెండు మ్యాచ్‌లకు దూరమైన ప్రధాన పేసర్ ఇషాంత్ శర్మ ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో, ఈ పొడగరి స్పీడ్ స్టర్ రేపటి మ్యాచ్‌కు బరిలో దిగే అవకాశాలున్నాయి

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments