Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాటింగ్ హామ్ వన్డే : రాయుడు రాణింపు... భారత్ విజయం!

Webdunia
ఆదివారం, 31 ఆగస్టు 2014 (10:42 IST)
నాటింగ్ హామ్ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌పై భారత క్రికెట్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో భారత్ నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 227 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ 43 ఓవర్లలోనే 228 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది. అంబటి రాయుడు (63 నాటౌట్), రహానే 45, రైనా 42, విరాట్ కోహ్లి 40 పరుగులతో రాణించారు. జడేజా 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వోక్స్, ఫిన్, స్టోక్స్, ట్రెడ్ వెల్ తలో వికెట్ తీశారు. 
 
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 227 పరుగులు చేసింది. కుక్ 44, హాల్స్ 42, బుట్లర్ 42, ట్రెడ్ వెల్ 30, బెల్ 28 రాణించారు. వోక్స్ 15, మోర్గాన్ 10, ఫిన్ 6, రూట్ 2, స్టోక్స్ 2 చొప్పున మాత్రమే పరుగులు చేశారు. భారత బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లు తీయగా, కుమార్, సామి, రైనా, రాయుడు, జడేజా తలో వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ 227 పరుగులకు ఆలౌట్ అయింది. 
 
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు రహానే 45, శిఖర్ ధావన్ 16 పరుగులు చేశారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి 40 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఈ క్రమంలో అంబటి రాయుడు (63) రహానే 45, రైనా 42 చొప్పన పరుగులు చేసి జట్టు విజయానికి బాటలు వేశారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments