Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాస్ వివాదం: మీడియాకు మొహం చాటేసిన టీమిండియా!

Webdunia
బుధవారం, 27 ఆగస్టు 2014 (12:42 IST)
డంకెన్ ఫ్లెచర్ విషయంలో కెప్టెన్ ధోనీకి, బిసిసిఐ అధికారులకు మధ్య తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఇంగ్లాండుతో రెండో వన్డే మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా మీడియాకు మొహం చాటేసింది.
 
మ్యాచ్‌కు ముందు జట్టు సభ్యుల్లో ఎవరో ఒకరు మీడియా సమావేశంలో పాల్గొనడం ఆనవాయితీ. కానీ తాజా వివాదంతో ఏ క్రికెటర్ కూడా మీడియా ముందుకు రాలేదు. 2015 ప్రపంచ కప్ పోటీల వరకు డంకెన్ ఫ్లెచర్ ‌బాస్‌గా ఉంటాడంటూ ధోనీ చేసిన ప్రకటన వివాదానికి దారి తీసింది.
 
ధోనీ ఆ ప్రకటన ద్వారా తన హద్దులను దాటాడని బిసిసిఐ అభిప్రాయపడింది. రవిశాస్త్రి జట్టు డైరెక్టర్‌గా నియమితులైన నేపథ్యంలో బాస్ ఎవరనే ప్రశ్నను ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే జట్టు యాజమాన్యం మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు. జట్టు నెట్ ప్రాక్టీస్ సమయంలో రవిశాస్త్రి, ఫ్లెచర్ ఇద్దరూ ఉన్నారు. కానీ మీడియా సమావేశానికి మాత్రం దూరంగా ఉన్నారు.

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

Show comments