Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోచ్ డంకన్ ఫ్లెచర్ మెడపై కత్తి: రేసులో రాహుల్ ద్రవిడ్?

Webdunia
గురువారం, 21 ఆగస్టు 2014 (12:06 IST)
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా ఘోరంగా ఓటమి పాలైన నేపథ్యంలో కోచ్ డంకన్ ఫ్లెచర్ మెడపై కత్తి పెట్టిన బీసీసీఐ నూతన కోచ్ కోసం అన్వేషిస్తున్నట్టు సమాచారం. రాజీనామా విషయంలో బీసీసీఐ ఇప్పటికే ఫ్లెచర్‌కు స్పష్టమైన సంకేతాలిచ్చిన తరుణంలో 'మిస్టర్ డిపెండబుల్' పేరు తెరపైకి వచ్చింది. 
 
బోర్డు పొమ్మనకుండా పొగబెట్టిన చందాన... కటువుగా వ్యవహరిస్తాడని పేరున్న రవిశాస్త్రిని కాస్తా ఫ్లెచర్‌కు ముందు సీట్లో కూర్చుండబెట్టింది. కామెంటరీ చెప్పుకుంటున్న ఈ మాజీ ఓపెనర్‌ను తీసుకువచ్చి టీమిండియాకు కోచింగ్ డైరక్టర్‌గా నియమించడం ఫ్లెచర్‌ను సాగనంపడానికేనని క్రీడా పండితులు అంటున్నారు. 
 
విండీస్‌తో సొంతగడ్డపై సిరీస్‌కు ఫ్లెచర్ వైదొలగాలనుకుంటే తామేమీ అడ్డుపడబోమని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో, వచ్చే సిరీస్‌కు భారత జట్టుకు కొత్త కోచ్ రానుండడం ఖాయమేననిపిస్తోంది. కాగా, టీమిండియాకు కోచ్‌గా వ్యవహరించడానికి రవిశాస్త్రి, రాహుల్ ద్రావిడ్ తగిన వ్యక్తులని క్రీడాపండితులంటున్నారు. 
 
ప్రస్తుత జట్టులోని అత్యధికులతో డ్రెస్సింగ్ రూం పంచుకుని ఉండడం ద్రావిడ్‌కు కలిసొచ్చే అంశం. పైగా, క్రికెటర్లలో మర్యాద రామన్నగానూ పేరుంది. ఏదేమైనా, టీమిండియా కొత్త కోచ్ ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే!

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments