Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా 505 ఆలౌట్ .. 97 పరుగుల ఆధిక్యం!

Webdunia
శుక్రవారం, 19 డిశెంబరు 2014 (11:25 IST)
సిడ్నీ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 505 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో కీలకమైన 97 పరుగుల ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. 
 
ఈ మ్యాచ్‌లో ఆసీస్ టెయిలెండర్లను ఔట్ చేయడానికి భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరి వికెట్‌గా స్టార్క్ 52 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయ్యాడు. 11వ నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా క్రీజులోకి వచ్చిన హ్యాజిల్ వుడ్ 32 పరుగులతో నాటౌట్‌గా నిలవడం గమనార్హం. 
 
ఈ మ్యాచ్‌లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... రెండు టీమ్‌లు సరిగ్గా 109.4 ఓవర్లకే ఆలౌట్ అయ్యాయి. తొలి ఇన్నింగ్స్ లో 97 పరుగుల ఆధిక్యాన్ని సాధించడంతో... ఆస్ట్రేలియా జట్టు పటిష్ఠ స్థితికి చేరుకుంది. ఈ స్కోరును సమం చేసి, ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలంటే భారత్ టాప్ ఆర్డర్ నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. 
 
భారత ఇన్నింగ్స్‌లో మురళీ విజయ్ సెంచరీతో ఆదుకున్న విషయం తెల్సిందే. అలాగే, ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో తాత్కాలిక కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (133), జాన్సన్ (88), స్ట్రాక్ (52), హాజ్లీవుడ్ (32 నాటౌట్)లు భారత బౌలర్లకు చుక్కలు చూపించి, భారీ స్కోరు చేసేలా దోహదపడ్డారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments