Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క శర్మపై కోహ్లీ మనస్సు లగ్నం... ఇంగ్లండ్‌లో చెత్త ప్రదర్శన!!

Webdunia
ఆదివారం, 20 జులై 2014 (10:38 IST)
భారత క్రికెట్ జట్టు భవిష్యత్ కెప్టెన్‌గా భావిస్తున్న విరాట్ కోహ్లీ మనసంతా తన ప్రేయసి అనుష్క శర్మపై కేంద్రీకృతమైవున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టులో సభ్యుడైన కోహ్లీ.. తన కెరీర్‌లో అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రత్యేక అనుమతిపై అనుష్కను ఇంగ్లండ్‌కు పంపిన.. కోహ్లీతో గడిపేందుకు బీసీసీఐ అనుమతిచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ప్రస్తుత ఇంగ్లండ్ టూర్‌లో విరాట్‌పై భారత అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే ఈ ఢిల్లీ స్టార్ బ్యాట్స్‌మెన్ మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు. ఇప్పటికి మూడు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ... ఒక ఇన్నింగ్స్‌లో కూడా మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాడు. తొలిటెస్టులో 1, 8 పరుగులు... రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డక్ (0) ఇదీ కోహ్లీ ప్రదర్శన. 
 
అయితే కోహ్లీ వైఫల్యానికి బాలీవుడ్ భామ అనుష్క శర్మే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు లండన్‌లోనే ఉందట. టీమిండియా బస చేసిన హోటల్లోనే మకాం వేసిందట. ఆట అయిపోవడం ఆలస్యం మన హీరో తన ప్రియురాలు ముందు వాలిపోతున్నాడట. ఇలాంటి పరిస్థితుల్లో గ్రౌండ్‌లో మనోడు బ్యాంటింగ్ ఏం చేస్తాడులే అని తోటి క్రికెటర్లే గుసగుసలు పోతున్నారట. 
 
గతంలో కూడా టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నప్పుడు అనుష్క పనిగట్టుకుని అక్కడకు వెళ్లింది. ఒకానొక సమయంలో అనుష్క షూటింగ్ కోసం శ్రీలంకలో ఉండగా... కోహ్లీ రెక్కలు కట్టుకుని అక్కడ వాలిపోయాడు. వీళ్లు పీకల్లోతు ప్రేమలో మునిగినంత మాత్రాన మనకొచ్చిన సమస్యేమీ లేదు... అయితే, వీరి రొమాన్స్ మన జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపుతుండటమే ట్విస్ట్. ఇకనైనా కోహ్లీ 'అసలైన బ్యాటింగ్'పై దృష్టి సారిస్తే టీమిండియాకు బెస్ట్. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments