Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీఆర్ఎస్ వచ్చేస్తోంది.. భారత క్రికెట్ బోర్డుకి బద్ద వ్యతిరేకి..

Webdunia
సోమవారం, 22 డిశెంబరు 2014 (11:39 IST)
ఆస్ట్రేలియా టూర్లో భారత్‌కు రెండో ఓటములు నమోదైనాయి. ప్రపంచంలో ఏ రెండు జట్ల మధ్య టెస్టు సిరీస్ జరిగినా అక్కడ అంపైర్ నిర్ణయ పునఃస్సమీక్ష పద్ధతి (డీఆర్‌ఎస్) ఉంటోంది. కానీ ఎందుకో ఆది నుంచీ డీఆర్‌ఎస్‌కు భారత క్రికెట్ బోర్డు బద్ద వ్యతిరేకి. రెండు దేశాలకు సమ్మతి అయితేనే ఈ పద్ధతి అమల్లో ఉంటుంది.
 
కాబట్టి భారత్ ఆడే టెస్టు సిరీస్‌ల్లో డీఆర్‌ఎస్ కనిపించదు. అయితే ఆసీస్ పర్యటనలో పలు నిర్ణయాలు భారత్‌కు వ్యతిరేకంగా వచ్చాయి. జరిగిన రెండు టెస్టుల్లో కనీసం ఐదు సార్లు డీఆర్‌ఎస్ లేని కారణంగా తగిన మూల్యం చెల్లించుకుంది. దీంతో మాజీ ఆటగాళ్లు కొందరు ఈ పద్ధతికి మద్దతుగా గళం విప్పుతున్నారు. 
 
ఎంతగా పోరాడినప్పటికీ అంపైరింగ్ తప్పిదాలతో జట్టు ఓడిపోవాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. కాబట్టి ఈ పద్ధతిని అమలు పరిచేందుకు ఇదే సరైన సమయమని వారు అంటున్నారు.
 
ఈ నేపథ్యంలో ‘సాంకేతికంగా ఎలాంటి పద్ధతితోనైనా కచ్చిత నిర్ణయాలు వస్తే వాటిని స్వాగతించాల్సిందే. నేను డీఆర్‌ఎస్‌కు వ్యతిరేకం కాదు. అయితే వంద శాతం కచ్చిత నిర్ణయాలు రావాలంటే ఈ పద్ధతి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. హాట్‌స్పాట్ లేక హాక్‌ఐ ద్వారా ఎల్బీను పరిశీలించడంపై నమ్మకం ఉంచలేకపోతున్నాను. ఈ రెండు విషయాలు డీఆర్‌ఎస్ పద్ధతిలో ఓ కొలిక్కి రావాల్సి ఉంది. అని భజ్జీ అన్నాడు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments