Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాన్ టైట్ సూపర్ బౌలింగ్: ఇంగ్లాండ్‌పై ఆసీస్ విజయం!

Webdunia
FILE
లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. షాన్ టైట్ సూపర్ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది. ఫలితంగా ఈ వన్డే సిరీస్‌‌లో చివరి రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా గెలిచినా 2-3 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 277 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లలో షేన్‌వాట్సన్ (14), వైట్ (20), కెప్టెన్ రికీ పాంటింగ్ (15), పైనీ (54)లు వెంట వెంటనే పెవిలియన్ దారి పట్టడంతో ఆసీస్ 30 ఓవర్లలో ఆస్ట్రేలియా 106 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.

తదనంతరం బరిలోకి దిగిన మైక్ హస్సీ, షాన్ మార్ష్‌ల అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టు గౌరవప్రదమైన స్కోరును నమోదు చేసుకుంది. వీరిలో షాన్ మార్ష్ 50 బంతుల్లో నాలుగు బౌండరీలు, మూడు సిక్సర్లతో 59 పరుగులు సాధించగా, మైక్ హస్సీ 60 బంతుల్లో ఐదు పోర్లు, రెండు సిక్సర్లతో 79 పరుగులు చేశాడు.

అనంతరం ఆసీస్ నిర్ధేశించిన విజయ లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆటగాళ్లలో షాన్ టైట్‌ 95 పరుగులు సాధించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును సంపాందించిపెట్టగలిగాడు. మిగిలిన బ్రిటీష్ బ్యాట్స్‌మెన్లు ఆసీస్ బౌలర్ల ధాటికి పెవిలియన్ దారి పట్టడంతో 46.3 ఓవర్లలో 235 పరుగులకే కుప్పకూలింది.

ఇకపోతే.. 48 పరుగుల్లో నాలుగు వికెట్లు పడగొట్టిన షాన్ టైట్ "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డును సొంతం చేసుకున్నాడు. అలాగే "మ్యాన్ ఆఫ్ ది సిరీస్" అవార్డును ఇయాన్ మోర్గాన్ కైవసం చేసుకున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నేపాల్ వెళ్లొద్దు, మాజీ ప్రధాని ఇంటికి నిప్పు, మంటల్లో ఆయన సతీమణి మృతి

మార్చురీకి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా.. 'సార్.. నేను బతికే ఉన్నాను' అంటూ లేచి కూర్చొన్న వ్యక్తి...

మాటలు సరిగా రాని మైనర్ బాలికపై అత్యాచారం

చంద్రబాబు అరెస్టు చేసిన ఆరోజు, నేటితో రెండేళ్లు - కీలక మలుపు తిప్పిన ఘటన

గ్రహణం రోజున తలపై మండే కుంపటితో అఘోర శ్రీనివాసరావు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ సినిమా కోసం రెక్కీ చేస్తున్న దర్శకుడు అట్లీ

4 రోజుల్లో 15.41 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కించుకున్న లిటిల్ హార్ట్స్

Siddhu: సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా తెలుసు కదా విడుదల తేదీ ఫిక్స్

గత ఏడాది డిసప్పాయింట్ చేసింది, విఎఫ్ఎక్స్ ఇన్ హౌస్ లో చేయడంతో కంట్రోల్ వుంది : టిజి విశ్వప్రసాద్

Roshan: రోషన్ ఛాంపియన్‌లో మలయాళ నటి అనస్వర రాజన్‌

Show comments