Webdunia - Bharat's app for daily news and videos

Install App

"కింగ్స్ ఎలెవన్"లో ముగ్గురు దేశవాళీలకు చోటు..!

Webdunia
FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్-3 కోసం పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఫ్రాంచైజీ ముగ్గురు దేశవాళీ ఆటగాళ్లకు స్థానం కల్పించింది. వారిలో మీడియం పేసర్ లవ్ అబ్లిశ్, షాలాబ్ శ్రీ వాస్తవ, వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మన్ మన్విందర్ బిస్లాలు ఉన్నట్లు కోచ్ టామ్ మూడీ వెల్లడించాడు.

ఈ ముగ్గురు దేశవాళీ ఆటగాళ్లను చేర్చుకోవటంవల్ల కింగ్స్ ఎలెవన్ బలోపేతం కావటంతోపాటు, జట్టులో పునరుత్తేజం కలుగుతుందని టామ్ మూడీ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్-3లో రాణించాలనే తపనతోపాటు.. బ్యాటింగ్, బౌలింగ్ చేయగల సత్తా వారికి ఉందనీ, ఈ సీజన్‌లో ఎలాంటి పోటీనైనా తట్టుకునేందుకు కింగ్స్ జట్టు సిద్ధంగా ఉందని అన్నాడు.

కాగా.. ముగ్గురు ఆటగాళ్ల చేరికను జట్టు కెప్టెన్ కుమార సంగక్కర స్వాగతించాడు. రంజీ ట్రోఫీలో వీరు అద్భుతమైన ప్రతిభను కనబర్చారని సంతోషం వ్యక్తం చేశాడు. ఆటపట్ల వీరికుండే అంకితభావం, నైపుణ్యం జట్టుకు ఎంతగానో దోహదపడుతుందని, ఈ ముగ్గురి చేరికతో కింగ్స్ జట్టులో మొత్తం 32 మంది అయ్యారన్నాడు. 10మంది విదేశీ ఆటగాళ్లు, 8 మంది భారత ఆటగాళ్లు, 14 మంది దేశవాళీ క్రికెటర్లు జట్టులో ఉన్నారని సంగక్కర వివరించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

Show comments