Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ క్రికెట్‌కు పేస్ బౌలర్ నాథన్ బ్రాకెన్ గుడ్‌బై

Webdunia
అంతర్జాతీయ క్రికెట్‌కు ఆస్ట్రేలియా పేసర్ నాథన్ బ్రాకెన్ స్వస్తి పలికాడు. గత ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యుడైన బ్రాకెన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి స్వయంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

మోకాలికి జరిగిన శస్త్ర చికిత్స అనంతరం వైద్యుల సలహా మేరకే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పదలచుకున్నానని 33 ఏళ్ల బ్రాకెన్ మీడియాకు తెలిపాడు. వెస్టిండీస్‌పై 2001లో వన్డేల్లో అరంగేట్రం చేసిన బ్రాకెన్ ఇప్పటివరకూ 116 వన్డేలాడి 174 వికెట్లు పడగొట్టాడు.

ఇంకా ఐదు టెస్టులు, 19 టి 20 మ్యాచ్‌ల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించిన బ్రాకెన్ పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరు సంపాదించాడు. కానీ మోకాలి గాయం కారణంగా జాతీయ జట్టుకు కొంతకాలం దూరంగా ఉన్నాడు. 2009 సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేనే బ్రాకెన్ కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావడం గమనార్హం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

Show comments