Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ కొత్త అధ్యక్షుడిగా పాకిస్థాన్ కెప్టెన్ జహీర్ అబ్బాస్

Webdunia
గురువారం, 25 జూన్ 2015 (16:56 IST)
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త అధ్యక్షుడిగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస్ ఎంపికయ్యారు. బార్బాడోస్‌లో జరిగిన వార్షిక సదస్సులో భాగంగా అబ్బాస్‌ను ఎన్నుకున్నట్లు ప్రకటనలో తెలిపింది. వెంటనే అబ్బాస్ ఏడాది పాటు సేవలందించేలా బాధ్యతలు స్వీకరించారు. 
 
ఈ సందర్భంగా జహీర్ అబ్బాస్ ప్రసంగిస్తూ.. అద్భుత క్రీడ క్రికెట్ నియంత్రణా మండలికి అధ్యక్ష బాధ్యతలు లభించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. క్రికెట్ వివిధ దేశాల మధ్య స్నేహ సంబంధాలను, గౌరవాన్ని పెంచుతుందన్నారు. 
 
ఐసీసీ పగ్గాలను చేపట్టడం ద్వారా పలు దేశాలకు సేవచేసే అవకాశం లభించడం తనకెంతో గర్వంగా ఉందన్నారు. తనపై గల నమ్మకంతో ఐసీసీ చీఫ్ పోస్టుకు తన పేరును సిఫార్సు చేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఈ సందర్భంగా అబ్బాస్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సమావేశానికి హాజరైన తాజా మాజీ చైర్మన్, బీసీసీఐ బోర్డు సభ్యుడు ఎన్.శ్రీనివాసన్ స్వయంగా జహీర్‌ అబ్బాస్‌ను ఆహ్వానించారు. ఆయన గొప్ప క్రికెటరని అభివర్ణించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments