Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీగారిని పెళ్లికి ఆహ్వానించిన యువరాజ్ సింగ్.. 30వ తేదీ అట్టహాసంగా వివాహం

టీమిండియా స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ పెళ్లి అంత అట్టహాసంగా జరిగేట్లు లేదు. యువరాజ్ సింగ్ సహచరులంతా ఆడంబరంగా వివాహం చేసుకుంటే.. యువరాజ్ సింగ్‌ను పెద్ద నోట్ల రద్దు కష్టాల్లో ముంచింది. పెళ్లి కోసం రూ

Webdunia
గురువారం, 24 నవంబరు 2016 (16:10 IST)
టీమిండియా స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ పెళ్లి అంత అట్టహాసంగా జరిగేట్లు లేదు. యువరాజ్ సింగ్ సహచరులంతా ఆడంబరంగా వివాహం చేసుకుంటే.. యువరాజ్ సింగ్‌ను పెద్ద నోట్ల రద్దు కష్టాల్లో ముంచింది. పెళ్లి కోసం రూ.2.5లక్షల్ని చేతబెట్టుకుని మిగిలిన వ్యవహారాలంతా కార్డుల్లో కానిచ్చేసినా చేతికి తగినంత డబ్బులేక యువీ పెళ్లి సో.. సోగా జరిగిపోనుందని క్రికెట్ పండితులు అంటున్నారు. 
 
అయితే యువీ పెళ్లి అట్టహాసంగా జరుగుతుందని ఆతని కుటుంబీకులు అంటున్నారు. కాగా తన పెళ్లికి రావాలంటూ ప్రధాని మోడీని ఆహ్వానించారు యువరాజ్ సింగ్. ప్రధానికి ఆహ్వానం అందజేసేందుకు ఇవాళ పార్లమెంటుకు వచ్చిన యువరాజ్ వివాహానికి తప్పకుండా రావాలని ఆహ్వానించారు. యువరాజ్‌తో అతని తల్లి షబ్నంసింగ్ కూడా ఉన్నారు. ఈ నెల 30వ తేదీ గురుద్వారాలో సిక్కు సంప్రదాయం ప్రకారం యువరాజ్ సింగ్ వివాహం జరుగనుంది. 
 
డిసెంబర్ 2వ తేదీన గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుక జరుగనుంది. మోడల్ హజల్ కీచ్‌తో ప్రేమలో ఉన్న యువీ.. ఇరు కుటుంబాల అంగీకరంతో పెళ్లి చేసుకుంటున్నాడు. ఢిల్లీలో ఐదో తేదీన రిసెప్షన్ ఉంటుంది. ఇంకా.. 7వ తేదీన చతర్ పూర్ లోని ఫామ్ హౌస్‌లో పార్టీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధానితో పాటు పలువురు మంత్రులు, ఇతర నాయకులను పెళ్లికి ఆహ్వానించారు. రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, క్రికెటర్లు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే ఈ పెళ్లిపై నోట్ల రద్దు ఎఫెక్ట్ కూడా ఉందని తెలుస్తోంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments