Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవిశాస్త్రి, కోహ్లీ పెట్టిన యోయో టెస్టే నా కొంపముంచింది.. యువరాజ్ సింగ్

Webdunia
సోమవారం, 4 నవంబరు 2019 (14:52 IST)
టీమిండియాలో చోటు కోల్పోవడానికి యోయో టెస్టే కారణమని, దాంట్లో పాస్ కాలేకపోవడం వల్లే క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశానని స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. అయితే, ఆ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఉంటే మాత్రం తన పరిస్థితి వేరేలా ఉండేదని, తన క్రికెట్ కెరీర్‌ను అర్థాంతరంగా ముగించాల్సి వచ్చేది కాదని యువరాజ్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 
 
టీమిండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్‌ కోహ్లీ హయాంలోనే యోయో టెస్టును ప్రారంభించడాన్ని యువరాజ్ సింగ్ పరోక్షంగా విమర్శించాడు. క్రికెటర్ బాగా ఆడుతుంటే ఆ టెస్టుతో పనేంటని నిలదీశాడు. సౌరవ్ గంగూలీ సక్సెస్‌ఫుల్ కెప్టెన్. ఆటగాళ్ల అవసరాలను అర్థం చేసుకునే విజయవంతమైన సారథి అని కితాబిచ్చాడు. గంగూలీని తాను దూరదృష్టి గలవాడిగా భావిస్తున్నాను. 
 
అతను దేశవాళీ క్రికెట్ స్థితిని కూడా మెరుగుపరచగలడని తాను ఆశిస్తున్నానని యువరాజ్ సింగ్ తెలిపాడు. కాగా, కేన్సర్‌ ను జయించి క్రికెట్‌లోకి మళ్లీ వచ్చాక యువీ యోయో టెస్ట్‌ పాస్‌ కాలేదంటూ జట్టులోకి తీసుకోలేదన్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments