Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక చెడు రోజు.. ఒక చెత్త సెషన్ మా కొంప ముంచింది : రవిశాస్త్రి

Webdunia
ఆదివారం, 18 ఆగస్టు 2019 (16:59 IST)
ఇటీవల ముగిసిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా సెమీస్‌లో న్యూజిలాండ్ జట్టు చేతిలో భారత క్రికెట్ జట్టు ఓడిపోవడంపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ఒక చెడు రోజు.. ఒక చెత్త సెషన్ మాకు శాపంగా మారింది. ఇదే తమకు అతి  పెద్ద పరాభవం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. 
 
టీమిండియాకు మళ్లీ ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికయ్యారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచ క్రికెట్ కప్‌లో లీగ్‌ దశలో కేవలం ఇంగ్లండ్‌ చేతిలో ఓడిపోయినా టాప్‌లో నిలిచాం. కానీ సెమీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో పోరాడి ఓడిపోయాం. కేవలం 30 నిమిషాల ఆటే మమ్మల్ని వెనక్కి నెట్టిందన్నారు. 
 
నా గత రెండేళ్ళ కోచింగ్‌ కెరీర్‌లో అది పెద్ద పరాభవం. ఒక చెడు రోజు, ఒక చెత్త సెషన్‌ మాకు శాపంగా మారింది అని రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. 'తదపరి రెండేళ్లలో రెండు ఐసీసీ టోర్నమెంట్‌లు ఉన్నాయి. ఇప్పటికే టెస్టు చాంపియన్‌షిప్‌ మొదలైంది. 2021లో టీ20 వరల్డ్‌కప్‌ జరుగనుంది. ఈ రెండింటికే తొలి ప్రాధాన్యత ఉంటుంది. ఆ మేరకు సన్నద్ధం కావడమే నా ముందున్న లక్ష్యమని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments