Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కప్‌లో హోలీ గిఫ్ట్: విండీస్‌పై ధోనీసేన విన్.. క్వార్టర్ ఫైనల్లోకి ఎంట్రీ!

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2015 (19:28 IST)
హోలీ కానుకగా టీమిండియా వరల్డ్ కప్‌లో క్వార్టర్ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. వెస్టిండీస్‌పై ముందు తడబడిన భారత్ సేన.. తర్వాత నిలకడగా రాణించి కరేబియన్లను మట్టికరిపించింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో భారత్‌కు కష్టాలు తప్పలేదు.

ముందుగా టాస్ గెలుచుకుని బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌కు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో హోల్డర్ (57), గేల్ (21), కార్టర్ (21), సామీ (26), టాయిలర్ (11) మినహా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. ఫలితంగా వెస్టిండీస్ 44.2 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు సాధించగా, యాదవ్, జడేజా చెరో రెండేసి వికెట్లు పడగొట్టగా, అశ్విన్, శర్మ చెరొక వికెట్ సాధించారు. 
 
తదనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. ఓపెనర్స్ శర్మ (7), ధావన్ (9) స్వల్ప స్కోరుకే అవుట్ కావడంతో భారత్ కష్టాల్లో పడింది. అయితే కోహ్లీ (33), రైనా (22), కెప్టెన్ ధోనీ (45 నాటౌట్)లు మెరుగ్గా రాణించడంతో టీమిండియా విజయబావుటా ఎగురవేసింది.

ఈ క్రమంలో 39.1 ఓవర్లలోనే ధోనీ సేన ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా 185 పరుగులు సాధించింది. విండీస్ బౌలర్లలో టాయిలర్ 2, రస్సెల్ 2, స్మిత్ 1, రోచ్ 1 వికెట్లు సాధించారు. కెప్టెన్ సమీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.  

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments