Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక మహిళా క్రికెట్లో లైంగిక వేధింపులు: సెక్స్ సుఖం లేకుంటే.. క్రికెట్ జట్టులో చోటు లేదు!

Webdunia
శనివారం, 23 మే 2015 (13:24 IST)
క్రికెట్ జట్టులో చోటుదక్కించుకోవాలంటే లైంగిక కోరిక తీర్చాల్సిందేనని పై అధికారులు వేధింపులకు దిగారు. బాధితులు ఫిర్యాదులు చెయ్యడంతో సంఘటనపై దర్యాప్తు జరిగింది. దర్యాప్తులో సదరు అధికారులు మహిళ క్రికెటర్లను లైంగిక వేధింపులకు గురి చేశారని వెలుగు చూసింది. ఈ కథంతా శ్రీలంక మహిళా క్రికెట్‌లో చోటుచేసుకుంది.
 
తాజాగా శ్రీలంక మహిళా క్రికెట్లో లైంగిక వేధింపులు కలకలం సృష్టించాయి. జాతీయ జట్టులో ఉండాలంటే తమకు సెక్స్ సుఖం అందించాల్సిందేనని కొందరు బోర్డు అధికారులు మహిళా క్రికెటర్లను ఒత్తిడి చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై శ్రీలంక క్రికెట్ బోర్డు విచారణ చేపట్టగా, నివ్వెరపరిచే నిజాలు బయటపడ్డాయని దేశ క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 
 
రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జ్ నిమల్ దిసనాయకే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించింది. ఆరోపణలు నిజమని తేల్చింది. శ్రీలంక జాతీయ మహిళా జట్టులోని చాలామంది క్రికెటర్లు ఈ వేధింపుల బారినపడ్డారని కమిటీ పేర్కొంది. తప్పు చేసినవారిపై కఠినచర్యలు ఉంటాయని క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది. కమిటీ సమర్పించిన నివేదికలో తగిన ఆధారాలు ఉన్నాయని తెలిసింది. 
 
ఇకపోతే శ్రీలంక మహిళా క్రికెట్ జట్టు వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 1-3 తేడాతో పరాజయం పాలయ్యింది. అయినప్పటికీ వరల్డ్ వన్డే ర్యాంకింగ్స్‌లో ఆరో ర్యాంకులో ఉంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్థాన్, ఇంగ్లండ్ క్రికెట్ టీమ్స్‌తో శ్రీలంక మహిళా జట్టు తలపడింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

ప్రియుడితో వెళ్లిపోయిన కుమార్తె .. కుటుంబం మొత్తం ఆత్మహత్య..

నువ్వు చనిపోవాలంటూ భర్త వేధింపులు - నవ వధువు ఆత్మహత్య

Bihar : పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. పొదల్లో ఒకరి తర్వాత ఒకరు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో