Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో వివాదంలో హార్దిక్ పాండ్యా... గ్యాంగ్‌స్టర్ భార్య అత్యాచార ఆరోపణలు

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (11:02 IST)
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరో వివాదంలో చిక్కుకున్నాడు. ముంబైకి చెందిన ఓ గ్యాంగ్‌స్టర్ భార్య అతనిపై అత్యాచార ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. 
 
అండర్‌ వరల్డ్‌ మాఫియా డాన్‌ దావూద్ ఇబ్రహీం సహాయకుడు రియాజ్ భాటి భార్య రెహ్నుమా భాటి.. హార్ధిక్ పాండ్యాతో పాటు మునాఫ్ పటేల్, పృథ్వీరాజ్‌ కొఠారీ, మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లాలపై సంచలన ఆరోపణలు చేసింది. సదరు వ్యక్తులంతా తనను లైంగిక వేధింపులకు గురి చేసి, అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ముంబైలోని సాంతా క్రూజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
తన భర్త రియాజ్ భాటి స్వప్రయోజనాల కోసం అతని వ్యాపార భాగస్వామ్యులతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేసేవాడని, అలా కొందరు హై ప్రొఫైల్ సెలబ్రిటీల వద్దకు తనను పంపేవాడని రెహ్నుమా తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే, రెహ్నుమా ఇచ్చిన ఫిర్యాదులో సరైన అడ్రస్ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
 
ప్రస్తుతం ఈ ఫిర్యాదుకి సంబంధించిన పేపర్లు నెట్టింట వైరల్‌గా మారింది. సెప్టెంబర్‌లో కేసు పెట్టినా పోలీసులు ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని, తనకు జరిగిన అన్యాయంపై పోలీసు ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోలేదని రెహ్నామా ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ కేసు వివరాలను వెల్లడించడానికి ముంబై పోలీస్ అధికారులు నిరాకరించారు. విచారణ జరుగుతుందని, ఇప్పుడేం చెప్పలేమన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

కాఫీ మెషిన్‌‌లో కాఫీ తాగుతున్నారా? గుండె జబ్బులు తప్పవు.. జాగ్రత్త

డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

తర్వాతి కథనం