Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాండ్యా ప్రమోషన్‌కు రవిశాస్త్రి కిటుకేనట.. : విరాట్ కోహ్లీ

భారత క్రికెట్ జట్టుకు మరో కపిల్‌దేవ్‌ దొరికాడంటూ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై క్రికెట్ పండితులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అదరగొట

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2017 (15:38 IST)
భారత క్రికెట్ జట్టుకు మరో కపిల్‌దేవ్‌ దొరికాడంటూ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై క్రికెట్ పండితులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అదరగొట్టాడు. ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ భారీ విజయలక్ష్యాన్ని (294 రన్స్) మరో రెండు ఓవర్లు మిగిలివుండగానే ఛేదించింది. దీనికి కారణం హార్దిక్ పాండ్యా ఇన్నింగ్సే కారణం. ఇదే విషయాన్ని ప్రస్తావించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, భారత జట్టుకు అతను కీలక ఆటగాడని పొగడ్తలు గుప్పించాడు.
 
బ్యాటింగ్ ఆర్డర్‌లో పాండ్యాకు ప్రమోషన్ కల్పించాలనే ఆలోచన తొలుత కోచ్ రవిశాస్త్రికి వచ్చింది. దీనిపై డ్రస్సింగ్ రూములో చర్చించాం. స్పిన్నర్లు బౌలింగ్ చేస్తున్న వేళ, అటాకింగ్ చేయగల ఆటగాడు కావాలని అనిపించింది. అతను విజయం సాధించాడు. మేము పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు పాండ్యా అని కోహ్లీ కితాబిచ్చాడు. 
 
భారత క్రికెట్ జట్టులో అతనివంటి ఆల్‌రౌండర్ ఉండటంతో సమతూకం పెరిగిందన్నాడు. రోహిత్, రహానేలు కూడా పాండ్యా వంటి కీలక ఆటగాళ్లేనని, బ్యాటు చేతిలో ఉంటే రెచ్చిపోయి ఆడుతుండే పాండ్యా నుంచి మరిన్ని కీలక ఇన్నింగ్స్ రావాలని అభిలషించాడు. గత ఐదారేళ్లుగా మంచి ఆల్‌రౌండర్ కోసం టీమిండియా వేచి చూస్తోందని, పాండ్యా రాకతో ఆ కోరిక తీరినట్లయిందని కోహ్లీ చెప్పుకొచ్చాడు. 
 
కాగా, తాను ఏ స్థానంలోనైనా ఆడేందుకు ఇష్టపడతానని నిన్నటి మ్యాచ్ అనంతరం పాండ్యా మీడియా సమావేశంలో చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్‌లో భాగంగా నాలుగో వన్డే గురువారం బెంగళూరులో జరగనుంది. ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

పహల్గామ్ ఉగ్రదాడి : పాకిస్థాన్‌పై భారత దాడికి ప్లాన్!!

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

పహల్గామ్‌ అటాక్: పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించని ప్రధాని

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

తర్వాతి కథనం
Show comments