Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెస్టుల్లో సచిన్ ఒకేసారి స్టంపౌట్ అయ్యేందుకు సెహ్వాగే కారణమట..

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్టంప్ అవుట్ కావడానికి డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగే కారణమట. సంప్రదాయ టెస్టు క్రికెట్ జీవితంలో ఒకే ఒక్కసారి స్టంపౌట్ అయ్యాడు. 2001లో ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌ ఆష్లే గ

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2016 (10:10 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్టంప్ అవుట్ కావడానికి డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగే కారణమట. సంప్రదాయ టెస్టు క్రికెట్ జీవితంలో ఒకే ఒక్కసారి స్టంపౌట్ అయ్యాడు. 2001లో ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌ ఆష్లే గైల్స్‌ వేసిన బంతిని ఆడేందుకు ముందుకు వచ్చి స్టంపౌట్ అయ్యాడు. ఇక ఆనాటి సచిన్ అవుట్ కు తనదే బాధ్యతని, తాను చెప్పిన మాటలు విని, సచిన్ వాటిని పాటించి అవుట్ అయ్యాడని, ఆ పాపం తనదేనని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. 
 
ఆష్లే గైల్స్‌ సచిన్ టెండూల్కర్‌కు బౌలింగ్ చేసేటప్పుడు లెగ్ సైడ్ వికెట్‌కు దూరంగా బంతులేస్తూ, సచిన్ టెండూల్కర్‌ను ఇబ్బంది పెడుతున్నాడని.. తాను సులభంగా ఆడుతుంటే.. సచిన్ ప్యాడ్లు అడ్డుపెడుతూ ఇబ్బంది పడ్డాడని సెహ్వాగ్ చెప్పాడు. 
 
ఆ సమయంలో సచిన్ వద్దకెళ్లి బంతి స్పిన్ కావట్లేదని.. ముందుకొచ్చి షాట్లు ఆడమని చెప్పానని.. కానీ దురదృష్ట వశాత్తూ... సచిన్ ముందుకొచ్చిన బంతే స్పిన్ అయ్యిందని.. అలా సచిన్ తొలిసారి స్టంపౌట్ అయ్యాడని చెప్పుకొచ్చాడు. ఆ రోజు తాను డ్రెస్సింగ్‌ రూంకే వెళ్లలేదు. అంపైర్ల గదిలోనే ఉన్న తనకు సచిన్‌ నుంచి పిలుపొచ్చింది. టెస్టుల్లో తొలిసారి స్టంపౌట్‌ అయ్యానని, అందుకు కారణం తానేనని అప్పుడు సచిన్ చెప్పినట్లు సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

తర్వాతి కథనం
Show comments