Webdunia - Bharat's app for daily news and videos

Install App

రషీద్ ఖాన్ సూపర్ అంటూ మహేష్ బాబు ట్వీట్.. థ్యాంక్యూ బ్రో మీ.. సినిమాల్ని?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్లో భాగంగా శుక్రవారం రాత్రి కోల్‌కతా వేదికగా జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో స్థానిక కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఓడిపోయింది. ఒత్తిడిని అధిగమించలేకపోవడంతో సన్‌రైజర్స్ హ

Webdunia
శనివారం, 26 మే 2018 (14:35 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్లో భాగంగా శుక్రవారం రాత్రి కోల్‌కతా వేదికగా జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో స్థానిక కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఓడిపోయింది. ఒత్తిడిని అధిగమించలేకపోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది.


ఇంకా హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ రషీద్ ఖాన్ బ్యాట్‌తో వీరవిహారం చేశాడు. ఫలితంగా సన్‌రైజర్స్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈనెల 27వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు తలపడనుంది. 
 
ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఆటగాడు రషీద్‌ ఖాన్‌ ప్రదర్శన చూసి వారంతా సోషల్‌మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చూపారని అభినందించారు. ఈ సందర్భంగా అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు కూడా ట్వీట్‌ చేశారు. రషీద్ ఖాన్ ఆట అదుర్స్ అంటూ మహేష్ కితాబిచ్చారు. 
 
సన్‌రైజర్స్‌ జట్టు మ్యాచ్ లో మెరుగ్గా ఆడిందని.. ఆదివారం మ్యాచ్‌ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని మహేష్ బాబు ట్వీట్ చేశారు. మొత్తం జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ బాబు ట్వీట్‌కు హైదరాబాదీ బ్యాట్స్‌మెన్ రషీద్‌ ప్రతి స్పందించారు. ''థ్యాంక్యూ బ్రో.. మీ సినిమాల్ని చాలా ఇష్టంగా, ఆసక్తిగా చూస్తుంటాను'' అని చెప్పారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

వారం రోజుల్లో ఏపీ పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలు

వడదెబ్బను రాష్ట్ర విపత్తుగా ప్రకటిస్తూ తెలంగాణ ఉత్తర్వులు

వర్షిణిని పెళ్లాడిన లేడీ అఘోరి - వీడియో ఇదిగో...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

దక్షిణాదిలో సమంత రీ ఎంట్రీ గ్రాండ్‌గా వుండబోతోంది.. చెర్రీ, పుష్పలతో మళ్లీ రొమాన్స్!?

తర్వాతి కథనం
Show comments