Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్ల్యూటీసీ ఫైనల్‌.. సునీల్ గవాస్కర్ కొన్ని సూచనలు

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (11:08 IST)
డబ్ల్యూటీసీ ఫైనల్‌పై టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్‌ కొన్ని సూచనలను చేశారు. సౌథాంప్టన్‌ వేదికగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిస్తే.. విజేతను ప్రకటించడానికి ఐసీసీ ఒక సూత్రాన్ని కనుగొనాలని సునీల్ అన్నారు. ఇరు జట్ల మధ్య ఆసక్తికరంగా సాగుతున్న మ్యాచ్‌లో వరుణుడు పదేపదే అంతరాయం కలిగిస్తున్నాడు. 
 
దాంతో ఇప్పటికే నాలుగు రోజుల ఆటలో రెండు రోజులకుపైగా నిలిచిపోయిందన్నాడు. అయితే, ఈ మ్యాచ్‌కు ఒక రిజర్వ్‌డే కేటాయించినా ఫలితం తేలేలా కనిపించడం లేదు. అందుకే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే తొలిసారి నిర్వహిస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసేలా కనిపిస్తోందన్నాడు. దాంతో ఇరు జట్లూ ట్రోఫీని పంచుకునే అవకాశం ఉందని వ్యాఖ్యానించాడు. 
 
"ఐసీసీ ఫైనల్స్‌లో ఒక ట్రోఫీని ఇలా రెండు జట్లు పంచుకోవడం ఇదే తొలిసారి కానుంది. ఫుట్‌బాల్‌ ఆటలో విజేతను ప్రకటించాలంటే వాళ్లకు పెనాల్టీ షూట్‌ఔట్ లేదా మరో పద్ధతిని అవలంబిస్తారు. అలాగే టెన్నిస్‌లో ఐదు సెట్లు నిర్వహిస్తారు. 
 
దాంతో పాటు టై బ్రేకర్‌ కూడా ఉంటుంది. అలాగే ఒకవేళ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ డ్రాగా పూర్తయితే విజేతను ప్రకటించడానికి ఒక సూత్రాన్ని కనుగొనాలి. ఈ విషయంపై ఐసీసీ క్రికెట్‌ కమిటీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి." అంటూ సునీల్ గవాస్కర్ వెల్లడించాడు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

తర్వాతి కథనం
Show comments