Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత బౌలర్ల ధాటికి విండీస్ విలవిల: 182 పరుగులకే ఆలౌట్!

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2015 (15:45 IST)
టీమిండియా బౌలర్ల ధాటికి వెస్టిండీస్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. భారత్‌కు 183 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన కరీబియన్ టీమ్ 44.2 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌటైంది. విండీస్ టాప్ ఆర్డర్ ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు.
 
కెప్టెన్ హోల్డర్ అర్ధసెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో వన్డేల్లో వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు నమోదు చేసుకున్నాడు. 64 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. గేల్ 21, కార్టర్ 21, సామీ 26, టేలర్ 11 పరుగులకే అవుట్ అయ్యారు. రామదిన్ డకౌటయ్యాడు. 
 
స్మిత్(6), శ్యామ్యూల్స్(2), సిమ్సన్(9), రసెల్(8) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3, ఉమేష్ యాదవ్ 2, జడేజా 2 వికెట్లు తీశారు. అశ్విన్, మొహిత్ శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments